–విద్యార్థులు తమ స్కోర్‌లను అధికారిక వెబ్‌సైట్ exams.nta. ac.inలో చెక్ చేసుకోవచ్చు
NEET RESULTS: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: నీట్ యూజీ రివైజ్డ్ పరీక్షా (NEET RESULTS) ఫలి తాలను, టాపర్ల వివరాలను ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ ఫలి తాలను అధికారిక వెబ్‌సైట్‌లో (Website) విడుదల చేసినట్లు ఎన్‌టీఏ అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ స్కోర్‌లను అధికారిక వెబ్‌సైట్ exams.nta.ac.inలో చెక్ చేసు కోవచ్చునని తెలిపింది. నీట్ పరీక్ష లో ఫిజిక్స్ విభాగంలో ప్రశ్న నెంబర్ 29కి కొంతమంది విద్యార్ధులకు ఇచ్చిన మార్కులు ఉపసంహరించు కోవాలని ఇటీవల ఎన్‌టీఏను ఆదే శించింది సుప్రీంకోర్టు. అత్యున్నత ధర్మాసనం ఆదేశాల మేరకు ఆ ప్రశ్నకు సంబంధించి విద్యార్థులకు ఇచ్చిన మార్కులను ఉపసంహరిం చుకుంది ఎన్‌టీఏ. అనంతరం రివై జ్ చేసిన మార్కుల ఫలితాలను విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే NEET UG పరీక్షలో ఫిజిక్స్ విభాగంలోని అటామిక్ థియరీకి సంబంధించిన 29వ ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయి.
వాటిలో దేన్ని ఎంపిక చేసినా మార్కులి చ్చారు. ఇదే అంశాన్ని సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచా రణ చేపట్టిన ధర్మాసనం ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌తో (Director of IIT Delhi) కూడిన ముగ్గురు నిపు ణులతో బృందాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రశ్నకు సరైన సమాధానాన్ని చెప్పాలని ఆదేశించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. క్వశ్చన్ నెంబర్ 29లో ఆప్షన్ 4 ఎంచుకున్న వారికే మార్కులు వేయాలని.. మిగతా వారికి తొలగించాలని ఎన్‌టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది.కోర్టు ఆదేశాల మేరకు ఎన్‌టీఏ రివైడ్జ్ ఫలితాలను విడుదల చేసింది. తాజా ఫలితాల ప్రకారం సుమారు 4.2లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులు (ప్రశ్నకు నాలుగు మార్కులు+ తప్పు రాసినందుకు ఒక నెగెటివ్ మార్క్) కోల్పోయారు. దీంతో టాప్ ర్యాంక్ సాధించిన వారి సంఖ్యలో మార్పు లు చోటు చేసుకున్నాయి.జూన్ 4న విడుదల చేసిన NEET UG 2024 ఫలితాల్లో మొత్తం 67 మంది విద్యా ర్థులు 720కి 720 మార్కులు సా ధించి టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. ఈ ఫలితాలు సంచలనం సృష్టిం చాయి. అయితే, తాజా రివైజ్డ్ ఫలి తాల్లో గతంలో ఫస్ట్ ర్యాంక్ సాధిం చిన వారి సంఖ్య తగ్గింది. 44 మం ది 5 మార్కులు కోల్పోవడంతో ర్యాం కర్ల జాబితా 67 నుంచి 17కు తగ్గింది.