Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

New Railway Line: అమరావతికి అందివచ్చిన అవ కాశం…త్వరలో కొత్త రైల్వే లైన్

New Railway Line: ప్రజా దీవెన అమరావతి:!ఎర్రుపాలెం, అమరావతి, నంబూ రు లైన్ సర్వే పూర్తయిందని పేర్కొ న్న దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ (GM Arun Kumar Jain)తెలిపారు. రైల్వే బోర్డు ఆమోదం, నిధులు మం జూరు కాగానే పనులు ప్రారంభి స్తామని వెల్లడిoచారు. విజయవా డ, గుంటూరు, గుంతకల్ డివిజన్ పరిధిలోని ఎంపీలతో సమావేశం లో అభివృద్ధి పనులు వివరించిన జీఎం అరుణ్ కుమార్ జైన్ దక్షిణ మద్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ (GM Arun Kumar Jain)ఏపీకి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో రైల్వే లైన్ ఏర్పాటునకు సర్వే పూర్తి అయిందని జీఎం పేర్కొన్నారు. ఎర్రుపాలెం – అమరావతి – నం బూరు లైన్ సర్వే పూర్తయిందని, రైల్వే బోర్డు ఆమోదం, నిధులు మంజూరు కాగానే కొత్త రైల్వే లైన్ పనులు ప్రారంభిస్తామని తెలిపా రు. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ పరిధిలోని (Range of Guntur, Guntakal Division) పార్లమెంట్ సభ్యులతో శుక్రవారం విజయవాడ సత్యనారాయణ పు రం వద్ద ఉన్న ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్‌లో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను ఆధునికీకరి స్తున్నామని ఈ సందర్భంగా జీఎం తెలిపారు. తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.21వేల కోట్ల రైల్వే లైన్ల ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీలు చేసిన ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు నివేదిస్తామని ఆయన తెలిపారు. పలు అభివృద్ధి అంశాలపై తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. బడ్జెట్ లో ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు రూ.9,151 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు.

ఏపీలో రూ.21వేల కోట్ల పనులు జరుగుతున్నాయని, అందులో 1,687 కిలో మీటర్ల కొత్త, డబుల్, ట్రిపుల్ లైన్ పనులు ఉన్నాయని చెప్పారు. ఏపీలో 97 శాతం రైల్వే లైన్లు (Railway lines)విద్యుదీకరణ జరిగాయని వివరించారు. గత మూడేళ్లలో తొమ్మిది ఆర్వోబీలు, 79 ఆర్‌యూబీలు నిర్మించామని, వివిధ స్టేషన్ల లో 35 పుట్ ఓవర్ బ్రిడ్జ్ లు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మరో 12 బ్రిడ్జీలు ఈ ఆర్ధిక సంవత్సరంలో పూర్తి చేయనున్నామని తెలిపారు.