–దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్
New Schemes for Public Welfare :ప్రజా దీవెన, దేవరకొండ: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టె పథకాలన న్నింటిని సాధ్యమైనంత ఎక్కువగా లబ్ధిదారులు సద్విని యోగం చేసు కునేలా అధికారులు చర్యలు తీసు కోవాలని దేవరకొండ శాసనసభ్యు లు బాలు నాయక్ కోరారు. ఏదైనా కొత్త పథకం వచ్చినప్పుడు జాగ్రత్త గా అధ్యయనం చేసిన తర్వాత సా ధ్యమైనంత మేర ఎక్కువ ఫలితా లను వినియోగించుకునేలా చర్య లు తీసుకోవాలన్నారు. పథకం మంజూరు, అమలు పై ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు. శనివా రం దేవరకొండ ఎంపీడీవో కార్యాల య సమావేశ మందిరంలో “ధర్తీ ఆబ జనజా తీ య గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ”పై నిర్వహించిన సమీ క్ష సమావేశానికి ఆయన ముఖ్యఅ తిథిగా హాజరయ్యారు.
కేంద్ర ప్రభుత్వం 70% రాష్ట్ర ప్రభు త్వ 30% వాటా తో దర్తి ఆబా పథ కాన్ని అమలు చేయడం జరుగు తుందని ఎం ఎల్ ఏ తెలిపారు .ఈ పథకం కింద దేవరకొండ నియోజక వర్గం లోని 29 గిరిజన గ్రామాలలో అమలు చేసేందుకు చర్యలు తీసు కోవడం జరిగిందని, ఈ గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయా లు కల్పించాల్సిన బాధ్యత అధికా రులపై ఉందని అన్నారు. తాగునీ టి పథకంలో భాగంగా స్థానిక తం డాలలో సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలన్నింటినీ గుర్తించి వా టిని తీర్చేందుకు చర్యలు తీసుకో వాలని తెలిపారు.
తండా గ్రామపంచాయతీలలో పను లన్నింటిని చేపట్టాలని, అద్దె భవ నాలలో నిర్వహిస్తున్న అంగన్వాడి కేంద్రాలకు పక్కా భవనాలకై ప్రతి పాదనలు సమర్పిం చాలని, వాటికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని, వై ద్య ఆరోగ్య సదు పాయాలను చెం చుతాండాలకు ప్రాధాన్యత ఇవ్వా లని, వాలంటీర్ల నియామకంలో స్థా నికులకే అవకాశం కల్పించాలని, పంచాయతీరాజ్ రహదారుల ని ర్మాణంలో భాగంగా ఒక తాండ నుండి మరో తాండకి రోడ్డు సౌక ర్యాలు కల్పించేలా చూడాలని, రెడ్కో ద్వారా గుర్తించిన 29 గ్రామా లలో సర్వే నిర్వహించి సోలార్ ద్వారా వ్యవసాయ బోర్లు, వీధిలై ట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, మత్స్య శాఖ ద్వా రా గిరిజనులు చేపల ఉత్పత్తులు అమ్ముకునేందుకుగాను మొబైల్ వ్యాన్లతో పాటు ,గిరిజన సొసైటీల సహకారంతో చేపలు పట్టే ఏర్పా టు చేయాలని తెలిపారు.
ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఉన్న డిమాండ్లను తెలుసుకొని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆ యన కోరారు. పనులకు సంబం ధించి అంచనాలను కచ్చితంగా ఉండేలా చూడాలని తెలిపారు . ఇందిరమ్మ ఇండ్ల పై చర్చ సంద ర్భంగా అర్హులకు ఇండ్లు రావా లని,అనర్హులు జాబితాలో ఉండ కూడదని, ఈ విషయంలో అధికా రులు పూర్తి కచ్చితంగా వ్యవహరిం చాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లా డుతూ దేవరకొండ నియోజకవ ర్గంలో దర్తి ఆబ ఆవాస్ యోజన ప థకానికిగాను 29 గ్రామాలను ఎంపి క చేయడం జరిగిందని, 50% గిరి జన జనాభా ఉన్న గ్రామాలను ఎం పిక చేస్తామని తెలిపారు. ముఖ్యం గా ఈ గ్రామాలలో సివిల్ పనులపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జ రుగుతుందని, పనులు శాశ్వతంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జ రుగుతుందని, ప్రతిపాదనలు పంపే టప్పుడు అధికారులు పూర్తి జాగ్ర త్తగా అన్నింటిని తెలుసుకోని ప్రతి పాదనలు సమర్పించాలని, ఈ నెల 13 లోగా ప్రతిపాదిత పనులన్నిం టికీ ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు.
ముఖ్యంగా తాగునీరు, అంగన్వా డి, పంచాయతీరాజ్, వైద్యం, వి ద్య , గ్రామీణాభివృద్ధి, మత్స్య రెడ్ కో ద్వారా పనులు చేపట్టడం జరు గుతుందని తెలిపారు. ఆర్డబ్ల్యూ ఎస్ ద్వారా తాగునీటి సంపులకు ప్రతిపాదించాలని, మత్స్యశాఖ ద్వారా కమ్యూనిటీ ఫిషింగ్ కు, అదే విధంగా మొబైల్ ఫిష్ యూ నిట్లు ప్రతిపాదించాలన్నారు. రెడ్ కో తరఫున సోలార్ పవర్ తోవీధి దీపాల ఏర్పాటు, వ్యవసాయ బా వులకు కనికేషన్ కు 29 గ్రామా లలో సర్వే చేసి ఎక్కడ అవసర ముందో రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు. ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ భవనాల కు ప్రతిపాద నలు పంపించాలని ,ముందుగా అ ద్దె భవనాలలో కొనసాగుతున్న వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉం చుకొని ప్రతిపాదనలు ఉండాలని ఆమె స్పష్టం చేశారు.
ప్రతిపాదనలు సమర్పించేటప్పు డు పంచాయతీరాజ్ తదితర పను లన్నీ పూర్తి జాగ్రత్తగా ఉండాలని, దీర్ఘకాలం పనులు ఉపయోగప డే లా చూడాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వాలంటీర్ల నియామ కంతో పాటు, సబ్ సెంటర్లలో కావా ల్సిన సౌకర్యాల కల్పన కింద ప్రతి పాదించడం జరుగుతుందన్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా జి సి డి సి తరహాలో గిరిజనులు త యారుచేసిన ఉత్పత్తుల అమ్మకాల అవుట్ లెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అంతేకాక వసతిగృహాలు, టెలికం గ్రామపం చాయతీ భవనాలు లేని కొత్త జీపీ లలో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రతిపాదించాలని సూచించారు .
ఈ సమావేశానికి అధ్యక్షత వహిం చిన జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్ దర్తి ఆబా యోజన పథకం గురించి వివరించారు. స్థాని క సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్ట ర్, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, డిఆర్డిఏ శేఖర్ రెడ్డి, దేవర కొండ ఆర్డిఓ రమణారెడ్డి, ఇన్చార్జి పంచాయతీ రాజ్ ఎస్ ఈ రామచం ద్ర రెడ్డి ,ఎం పీడీవో డేనియల్, జిల్లా మత్స్య శాఖ అధికారి సూచరిత, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.