Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nirmala Sitharaman: బడ్జెట్ మేధోమదనం

–ఆదాయపు పన్ను తగ్గింపుకు కేంద్రం సమాలోచనలు
–నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై కొనసాగుతోన్న కసరత్తు
Nirmala Sitharaman:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఆదాయ పన్ను తగ్గించడం ద్వారా మధ్య తరగతి ప్రజల ప్రయోజనమే ధ్యేయంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM MODI)ప్రభు త్వం జూలైలో ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జె ట్‌లో (NEW BUDGET)ఉద్యోగ వర్గాలు, వేతన జీవు లకు ఊరట కలిగించే విధంగా పలు నిర్ణయాలు ప్రకటించనుందని అధి కార వర్గాలు చెప్పకనే చెబుతున్నా యి. ముఖ్యంగా ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కిందిస్థాయి శ్లాబుల్లో ఉన్నవారికి ప్రయోజనం కలిగించేలా పన్నులు తగ్గించే అవకాశం ఉన్నట్టు వెల్లడిస్తున్నా యి.

సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపుపై దృష్టి పెట్టడం కన్నా, మధ్య తరగతి వర్గం ప్రజల చేతుల్లో నాలుగు డబ్బులు ఉండేటట్టు చూ సి తద్వారా ఆర్థిక ప్రగతికి దోహద పడాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం (GOVERMENT) ఉ న్నట్టు తెలుస్తోంది. ఆదాయపు పన్ను భారం తగ్గితే ఆ రూపంలో ఆదా అయిన సొమ్ముతో వస్తువులు కొనుగోలు చేస్తారని, దాని ద్వారా ఒకదానితో మరికొటి ముడి పడి ఉండే ఆర్థిక కార్యకలాపాలు పెరు గుతాయని అంచనా వేస్తోంది. ప్రస్తు తం వార్షిక ఆదాయం రూ.3 లక్షల వరకు ఉంటే 5% ఆదాయపు పన్ను (TAX) చెల్లించాల్సి ఉంది. అది శ్లాబుల వారీగా పెరుగడం, ఆదాయం రూ. 15 లక్షలకు చేరుకుంటే పన్ను 30% పెరుగుతుండగా ఆదాయం అయి దు రెట్లు పెరిగితే పన్ను శ్లాబు మా త్రం ఆరు రెట్లు పెరుగుతోంది. ఈ పెరుగుదలలో హేతుబద్ధత లేదని, శ్లాబులు కూడా మరీ ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావి స్తున్నాయి. జులైలో ప్రవేశపెట్టనున్న 2024–25 బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి గా మరోసారి బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ కసరత్తు ప్రారం భించారు. మంగళవారం రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రాతో చర్చలు జరపడం ద్వారా ఈ నెల 20న పారిశ్రామిక వర్గాలతో భేటీ అయి సలహాలు స్వీకరించనున్నా రు.