NITI Aayog : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఖనిజ రం గానికి అధిక ప్రాధాన్యత దక్కింది. తగిన ప్రాధాన్యత కల్పిస్తూ కార్యా చరణ ప్రారంభించి మిగిలిన అన్ని రాష్ట్రాల కన్నా ముందున్న నేపథ్యం లో దేశవ్యాప్త గుర్తింపును పొందు తుందని, ఇటీవల నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటు చేసిన జాతీయ స్థా యి కీలక ఖనిజ కమిటీలో రాష్ట్ర ప్ర భుత్వ సంస్థ అయిన సింగరేణికి ప్ర ముఖ స్థానం కల్పించడం దీనికి ని దర్శనమని రాష్ట్ర ఉప ముఖ్యమం త్రి భట్టి విక్రమార్కమల్లు పేర్కొన్నా రు. ఈనెల 19వ తేదీన నీతి ఆయో గ్ ప్రకటించిన జాతీయ స్థాయి కీల క ఖనిజాల గుర్తింపు, అన్వేషణ క మిటీలో సింగరేణి సంస్థకు ప్రాధాన్య తనిస్తూ ఆ సంస్థ సీఎండీని సభ్యు నిగా పేర్కొంటూ ఆఫీస్ మెమొరాం డం విడుదల చేసిన నేపథ్యంలో భ ట్టి విక్రమార్కమల్లు గురువారం ఈ ప్రకటన చేశారు.
దేశ అవసరాలకు కీలకమైన కీలక ఖనిజాల అన్వేషణను తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా పరి గణిస్తూ ప్రభుత్వ సంస్థలను ప్రోత్స హిస్తూ ముందుకెళ్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశా రు. ఇప్పటికే ఆస్ట్రేలియా, రష్యా, ఘనా వంటి దేశాలతో వ్యాపార వి స్తరణ అవకాశాలపై చర్చలు జరు పుతున్నామని, కీలక ఖనిజరంగం లో గల అవకాశాలను అధ్యయనం చేయటానికి ఇప్పటికే ఏజెన్సీలను నియమించుకున్నామని తెలిపారు. ఇటీవల కేంద్రం నిర్వహించిన కీలక ఖనిజాల అన్వేషణ వేలంపాటలో సింగరేణి సంస్థ పాల్గొని బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు లైసెన్స్ కూడా సాధించిందన్నారు.
సింగరేణి ప్రాంతంలోని గుట్టల్లో, ఓ పెన్ కాస్ట్ గనుల మట్టిలో, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి వెలు వడే ఫ్లై యాష్ మరియు బాటమ్ యాష్ లో ఉన్న కీలక ఖనిజాలు, రే ర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను గుర్తించడాని కి, వాటిని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి గల అవకాశాలపై కలి సి పని చేసేందుకు జాతీయస్థాయి సంస్థలైన ఎన్ ఎఫ్ టిడిసి, ఐఎంఎం టీ, జె ఎన్ ఏ ఆర్ డి డి సి వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకు న్నామన్నారు.
అదే కాకుండా తెలంగాణ ప్రభుత్వ దిశా నిర్దేశంలో సింగరేణి కీలక ఖని జ రంగంలో అవలంబిస్తున్న విధా నాలను ఇతర రాష్ట్రాలు కూడా ఆ దర్శంగా తీసుకుంటున్నాయని ఆ యన పేర్కొన్నారు. ఇటీవల అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా కేంద్ర గనుల శాఖకు రాసిన లేఖలోనూ కీలక ఖనిజాల విషయం లో సింగరేణి మోడల్ ను స్వీకరిం చాలని ప్రస్తావించడం మన రాష్ట్ర విధానాలకు జాతీయ స్థాయిలో ద క్కుతున్న గుర్తింపుగా భావించవచ్చ న్నారు.
అలాగే గ్రీన్ ఎనర్జీ రంగంలోనూ సిం గరేణి విస్తరణ కోసం ఎన్టీపీసీ అను బంధ సంస్థ అయిన ఎన్జీఇఎల్ సం స్థతో కలిసి పని చేయడానికి కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు.2300 మెగావాట్ల వి ద్యుత్ ప్లాంట్లకు రాజస్థాన్ క్యాబి నె ట్ ఆమోదం హర్షణీయం తెలం గా ణ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో రాజస్థా న్ విద్యుత్ ఉత్పదాన్ నిగమ్ లిమి టెడ్ తో కలిసి సింగరేణి సంస్థ 230 0 మెగావాట్ల థర్మల్, సోలార్ విద్యు త్ ఉత్పాదనకు కుదుర్చుకున్న ఒ ప్పందానికి బుధవారం ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం హర్ష నీయమని రాష్ట్ర ఉప ముఖ్యమం త్రి భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నా రు.
ఉభయ రాష్ట్రాలకు మేలు చేసే వి ధంగా మరియు దేశ విద్యుత్ అవ సరాలకు తగిన విధంగా సహక రిo చేందుకు ఈ మెగా ప్రాజెక్టును సం యుక్తంగా చేపట్టామన్నారు. రాజ స్థాన్ రాష్ట్ర క్యాబినెట్ అనుమతి లభించింది కాబట్టి రాజస్థాన్ లోని సోలార్ వ్యాలీలో ఏర్పాటు చేయ నున్న 1500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ కు కావలసిన స్థలం త్వరగా సమకూరుతుందన్నారు. ఒప్పందం లో భాగంగా మరో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ ను ప్రస్తుత మం చిర్యాల సమీపంలో గల సింగరేణి థర్మల్ విద్యుత్ ప్రాంగణంలో ఏ ర్పా టు చేయనుందని పేర్కొన్నారు.
క్యాబినెట్ సమావేశంలో సింగరేణి – రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన ని గం లిమిటెడ్ ఒప్పందానికి అను మతి ఇచ్చిన రాజస్థాన్ రాష్ట్ర ప్రభు త్వానికి తన అభినందనలు శుభా కాంక్షలు తెలియజేశారు. త్వరలో సింగరేణిని జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో విస్తరించేలా ప్రణాళి కలు రూపొందించినట్లు పేర్కొ న్నా రు.వీలైనంత త్వరగా ఈ ప్లాంట్ల ని ర్మాణాన్ని చేపట్టేందుకు జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి సీ ఎండీ ఎన్.బలరామ్ ను ఆ దేశించా రు.