— ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
Mother’s Day :ప్రజా దీవెన,దామరచర్ల: సృష్టిలో తల్లిని ప్రేమను మించింది ఏమీ ఉం డదని ఎమ్మెల్సీ, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు.
మదర్స్ డే సందర్భంగా ఆదివారం నల్గొండ జిల్లా దామరచర్ల మండ లం దిలావూర్పూర్ గ్రామ పరిధిలో ని కేతావత్ తండాలో తన తల్లి కే తావత్ హాషా విగ్రహానికి పూలమా లు వేసి నివాళులర్పించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ తల్లి దండ్రులు దైవంతో సమానమని అన్నారు. ముఖ్యంగా అమ్మ లేక పోతే జననం లేదు, గమనం లేదు, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తొలి గురువు తల్లేనని కొనియాడారు.
పుట్టినప్పటినుంచి నడక నేర్పే వర కు ప్రతి అడుగులో అమ్మ పాలు పంచుకుంటుందని అన్నారు. ఈ ప్ర పంచంలో తల్లి ప్రేమకు సమానమై నది మరొకటి లేదని స్పష్టం చేశా రు. చిన్నప్పటినుంచి తమ పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారని గుర్తు చేశారు.
తన తల్లిదండ్రులు కీ||శే. కేతావత్ వీర్యా నాయక్- హాషా కష్టపడడం వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నా నని పేర్కొన్నా రు. ఈ సందర్భంగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపా రు.