–ఒత్తిడితో ఆ దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజీనామా
Obaidul Hasan: ప్రజా దీవెన, ఢాకా: బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ (Obaidul Hasan) రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. హసన్ తప్పుకోవాలని శనివారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వాళ్లు అల్టిమేటమ్ జారీ చేశారు. చీఫ్ జస్టిస్‌తో పాటు అపిల్లేట్ డివిజన్ జడ్జీలు (Appellate Division Judges) మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజీనామా చేయాలని విద్యార్థులు హెచ్చరించారు. ఒకవేళ తప్పుకోని పక్షంలో.. వారి ఇండ్లపై దాడులు చేయనున్నట్లు విద్యార్థులు బెదిరించారు.
యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూమెంట్ (Anti-Discrimination Student Movement) కు చెందిన కోఆర్డినేటర్ హస్నత్ అబ్దుల్లా ఈ అల్టిమేటమ్ జారీ చేశాడు. అయితే జడ్జీల భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని తన పోస్టుకు రాజీనామా చేయనున్నట్లు చీఫ్ జస్టిస్ ఇవాళ జర్నలిస్టులకు తెలిపారు. రాజీనామా చేసేందుకు కొన్ని ఫార్మాల్టీలు ఉన్నాయని, వాటిని పూర్తి చేస్తున్నామని, దేశాధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దిన్‌కు రాజీనామా లేఖను పంపనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన హింస, అల్లర్ల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా (Sheikh Hasina’s resignation) చేసి దేశం విడిచి వెళ్లారు. ఆ తర్వాత అక్కడ యునిస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని (Provisional Government) ఏర్పాటు చేశారు.