Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Om Birla: ఎమర్జెన్సీ ఎప్పటికీ ఓ చీకటి అధ్యాయమే

— సభలో ప్రస్తావించిన స్పీకర్ ఓం బిర్లా
–విపక్షాల తీవ్ర అభ్యంతరం మధ్య సభలో మౌనం

Om Birla: ప్రజా దీవెన, న్యూఢిల్లీ : లోక్సభ స్పీకర్ గా (Lok Sabha Speaker) వరుసగా రెండోసారి ఎన్ని కైన ఓం బిర్లా (Om Birla) సభలో చేసిన తొలి ప్రసంగం సందర్భంగా ఆయన ‘ఎమ ర్జెన్సీ అంశాన్ని ప్రస్తావించారు. అత్యయిక స్థితి నాటి విషాదాన్ని గుర్తుచేసుకుంటూ సభలో మౌనం (the silence) పాటించారు. అయితే, స్పీకర్ ప్రసం గంపై కాంగ్రెస్ సహా విపక్షాలు అ భ్యంతరం వ్యక్తం చేశాయి. సభా పతిగా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోదీ (PM MODI), ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా సభ్యులు అభినందనలు తెలి పారు. అనంతరం ఓం బిర్లా ‘ఎమర్జె న్సీ’పై తీసుకొచ్చిన తీర్మానాన్ని చద వి వినిపించారు. 1975 జూన్ 25 మన దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఆ రోజున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమ ర్జెన్సీ ని విధించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు.

ప్రపంచంలోనే మనం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు సాధించాం. ఆ ప్రజాస్వామ్య విలు వలు, చర్చలు దేశాన్ని ముందుకు నడిపిస్తాయి. కానీ, నాటి ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) నియంతృత్వాన్ని అమలు చేశారు. ప్రజాస్వామ్య సూత్రాలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ను అణగదొక్కారు. ప్రతిపక్ష నేత లను జైల్లో (JAIL) పెట్టారు. మీడియాపై ఆంక్షలు విధించారు. యావత్ దేశం కారాగారంగా మారిపోయిందని స్పీకర్ (SPEAKER) గుర్తుచేశారు. నాటి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించడాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్య రక్షణ (Defense of democracy) కోసం అత్యయి క స్థితిని ఎదిరించిన వారిని తాము అభినందిస్తున్నామని ఓం బిర్లా అన్నారు. అనంతరం నాటి చీకటి రోజులకు నివాళిగా సభలో ఒక నిమిషం పాటు మౌనం పాటిద్దా మని సభ్యులను కోరారు. అనం తరం సభను రువారానికి వాయిదా వేశారు. అయితే, స్పీకర్ మాట్లాడు తున్న సమయంలో కాంగ్రెస్ సహా విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశా రు. స్పీకర్ ప్రసంగంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీని స్పీకర్ తీవ్రంగా ఖండించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజాస్వా మ్యం గొంతు నొక్కి అప్పటి ప్రభు త్వం సాగించిన అన్యాయాలను ఆయన ఎత్తిచూపారు. దాదాపు 50 ఏళ్ల క్రితం దేశంలో అత్యయిక స్థితిని విధించారు. దాని గురించి నేటి తరం తెలుసుకోవడం చాలా ముఖ్యం. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ప్రజాభిప్రాయాన్ని అణచి వేసి, సంస్థలు నాశనం చేసినప్పుడు సమాజం ఎలా ఉంటుందో చెప్పేం దుకు నాటి రోజులే సరైన ఉదా హరణ. నియంతృత్వం ఎలా ఉంటుందో ఎమర్జన్సీ పరిస్థితుల నుంచి తెలుసుకోవచ్చు’ అని మోదీ (MODI) ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించారు.