Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Sharath Chandra Pawar : నల్లగొండ జిల్లా పోలీసు కార్యాల యంలో ఓపెన్ హౌజ్ కార్యక్రమం

–రేపటి రక్తదాన కార్యక్రమానికి యువత,జిల్లా ప్రజలు అధిక సం ఖ్యలో పాల్గొనాలన్న జీల్లా ఎస్పి శర త్ చంద్ర పవార్

SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: ఈ నెల అ క్టోబర్ 21 నుంచి 31 వరకు నిర్వ హించే పోలీస్ అమరవీరుల సంస్మ రణ వారోత్సవాలలో బాగంగా గు రువారం అమరవీరుల త్యాగాల ను, స్మరిస్తూ జిల్లా పోలీస్ కార్యా లయంలో జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలల విద్యార్దిని, విద్యా ర్థులకు పోలీస్ సిబ్బంది నిర్వహిం చే విధులు,విది నిర్వహణలో సం ఘవిద్రోహక శక్తులు ఎదురైనప్పుడు ఉపయోగించే ఆయుధాలు, విఐ పిల పర్యటన సమయంలో వారి భ ద్రతా రిత్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వ్యవహరించిన తీరుపై వివరించా రు.

బాంబ్ డిటెక్టర్ పరికరాలు, పోలీస్ డాగ్స్ వాటి పనీతీరును, నేరాలు, దొంగతనాలు జరిగినప్పుడు నిం ది తులను కనిపెట్టే విషయంలో కావ లిసిన క్లూస్ ఫింగర్ ప్రింట్, క్లూస్ టీమ్, మహిళ భద్రత పైన షీటీమ్, భరోసా, కమాండ్ కంట్రోల్ రూమ్ సీ సీ కెమెరాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన టెస్టింగ్ కిట్ లతో తదితర స్టాల్స్ ఏ ర్పాటు చేసి సంబంధిత అధికా రు లు, సిబ్బంది విద్యార్దిని, విద్యార్థుల కు పూర్తిస్థాయిలో అవగాహన క ల్పించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులతో జి ల్లా ఎస్పి మాట్లాడుతూ ప్రస్తుత పరి స్థితుల్లో ఎక్కువుగా ప్రతి రోజు ఎక్క డో ఒక చోట సైబర్ నేరాల జరుగు తున్నాయని,వాటి వలలో పడకుం డా అనవసరమైన యాప్ లను డౌ న్లోడ్ చేసుకోవద్దని మరియు ఎవ్వరి కీ కూడా ఓ.టి.పిలు చెప్పకుండా జా గ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అ లాగే గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల సేవించడం వల్ల కలిగే ఆ రోగ్య సమస్యలు భవిష్యత్తులో జరి గే పరిణామాల పై వివరించారు. సో షల్ మీడియా ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ లలో అవసరమైన వీడియోలు చూ స్తూ సమయాన్ని వృధా చేసుకోకుం డా, చదువుల మీద శ్రద్ధచూపి అను కున్న లక్ష్యాలను సాధించాలన్నా రు.

అలాగే రేపు జిల్లా పోలీసు కార్యా లయంలో ఉదయం 10.30 గంటల కు అమరవీరుల సంస్మరణ వారో త్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న రక్తదాన కార్యక్రమానికి జిల్లా ప్రజ లు, యువత, యువజన సంఘా లు, విద్యార్థి సంఘాల వారు అమ రవీరుల త్యాగాలను గుర్తు చేసు కుంటూ అధిక సంఖ్యలో పాల్గొ నా లని ఈ సందర్భంగా ఎస్పీ పిలుపు నిచ్చారు

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,ఏ.ఆర్ డి.యస్.పి శ్రీనివాస్, సిఐలు రాఘవరావు, రాము, మహా లక్ష్మయ్య, కరు ణాకర్,రాజశేఖర్ రెడ్డి,ఆర్.ఐ లు, సంతోష్,శ్రీను,సూరప్ప నాయు డు, ఆర్.యస్.ఐ లు కళ్యాణ్ రాజ్, రా జీవ్,సాయిరాం, సంతో ష్, అశోక్, శ్రావణి, మమత, సిబ్బంది, విద్యార్ది ని,విద్యార్దులు పాల్గొన్నారు.