–సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
Tummala Veera Reddy CPM : ప్రజాదీవెన నల్గొండ : నల్లగొండ జిల్లా కేంద్రం గడియారం సెంటర్ లో నీ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను మంత్రి క్యాంపు కార్యాలయం గా మార్చడం పట్ల సిపిఎం కార్యవర్గం ఖండిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ గా రాష్ట్రస్థాయి అధికారులు ఉన్నత స్థాయి గవర్నర్, ఇతర శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు వినియోగించుకునే గెస్ట్ హౌస్ ను రోడ్డు భవనాల శాఖ మంత్రి తమ శాఖ అధీనంలో ఉందని మంత్రి క్యాంప్ కార్యాలయం గా మార్చుకోవడం సరైనది కాదని పేర్కొన్నారు. ఇప్పుడు మంత్రి క్యాంపు కార్యాలయం కాస్త మరి కొంత కాలానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. క్లాక్ టవర్ సెంటర్లో మంత్రి కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై ప్రజలు ఆ సెంటర్లో నిరసన తెలియజేయకుండా అడ్డుకునే కుట్రని ప్రజాస్వామ్యా స్వేచ్ఛను భంగపరిచి హరించడమే అన్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను మంత్రి క్యాంప్ కార్యాలయంగా మార్చడం పట్ల ఆర్ అండ్ బి శాఖ అధికారులు మౌనం పాటించడం సరైనది కాదన్నారు.
గతంలో మాదిరిగానే ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ గా కొనసాగించాలని ఈ విషయంపై మంత్రి సైతం పునర్ ఆలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాత్కాలికంగా మంత్రి కార్యాలయంగా ఉపయోగించుకున్నప్పటికీ శాశ్వతంగా వేరే చోట ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ నాయకులు, మంత్రి సైతం పెద్దన్న పాత్ర పోషించి అందరి ప్రయోజనాల కోసం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ గా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. శాఖ చేతిలో ఉందని ప్రజా ప్రయోజన కోసం ఆర్ అండ్ విశ్రాంతి భవనం క్యాంప్ కార్యాలయం గా మార్చొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. మంత్రి క్యాంప్ కార్యాలయం నిర్మించుకోవడంలో తప్పు పట్టడం లేదని, మంత్రి క్యాంప్ కార్యాలయం నిర్మించడానికి అనేక స్థలాలు ఉన్నాయని వేరే చోట నిర్మించుకుంటే బాగుండేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా పునర్ ఆలోచించి గెస్ట్ హౌస్ గా కొనసాగించకపోతే జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, సయ్యద్ హాషం, చినపాక లక్ష్మీనారాయణ, ప్రభావతి,వి వెంకటేశ్వర్లు ఖండించారు.