–ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ సిల్వర్ అశోక్ కుమార్
Osmania University : ప్రజా దీవెన్:/ కనగల్: బాబుజిగా ప్రఖ్యాతి గాంచిన జగ్జీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసంతన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం సామాజిక విప్లవ యోధుడు బాబు జగ్జీవన్ రామ్ నేడు ఆయన 117 వ జయంతి.ఒక వైపు దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూనే ,మరోవైపు సామాజిక సమానత్వం కోసం,అనగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని కృషి చేశారు,దళిత హక్కులను చట్ట రూపంలో తీసుకువచ్చిన మహా మేధావి.
1908 ఏప్రిల్ 05 బీహార్ లోని షాబాద్ జిల్లాలోని చాంద్వా గ్రామంలో శోభిరాము, బసంతి దేవిలకు జన్మించారు. జగ్జీవన్ ఆయన తండ్రి మొదట్లో బ్రిటిష్ ఆర్మీలో పని చేసేవారు ఆ తరువాత కొన్నాళ్లకు రాజీనామా చేసిసొంత గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ స్థిర పడిపోయారు ,తన 6 వ ఏట నుంచి సొంత గ్రామంలోని పాఠశాలలో చేరారు బాబుజి,అదే సమయంలో ఆయన తండ్రి మరణించాడు అంతటి దుఃఖ పరిస్థితుల్లోనూ పిల్లల్ని పాఠశాలకు పంపగలరు బసంతి దేవి.
తండ్రి జీవన తాత్రిక బాటలో అహింసా తత్వాన్ని పుణికి పుచ్చుకొని ,జాతీయ ఉద్యమంలో గాంధీ స్ఫూర్తితో పాల్గొని దేశ రాజకీయాల్లో ఒక సరి కొత్త నినాదంగా మారిన వ్యక్తి.బ్రిటిషర్ట్స్ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకొస్తున్న సందర్భంలోనే ఆల్ ఇండియా అణగారిన వర్గాల సమాఖ్యను ఏర్పాటు చేసి దళిత బహుజన వర్గాలను జాతీయస్థాయిలో ఐక్యపరిచే కార్యచరణ పై ఉద్యమించాడు.జాతీయ దృక్పథంతో పనిచేస్తూ దళిత బహుజనోధరణకు పూనుకున్న ప్రజ్ఞావంతుడు జగ్జీవన్ రామ్మానవ సమాజ మార్పుకు దోహదపడే రాజ్యాంగ మార్గ పద్ధతుల పట్ల బలమైన నమ్మకంతో పనిచేసేవాడు.
రాజ్యాంగ రచనకు ఏర్పాటు అయిన రాజ్యాంగ సభ సభ్యునిగా బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహించాడు అత్యంత గౌరవనీయమైన దళిత నాయకులలో ఒకరైన జగ్జీవన్ రామ్అంత ఉంది 1935 అక్టోబర్ 19 నదళితులకు ఓటు హక్కు కోసం హమాండ్ కమిషన్ ముందు వాదనలు వినిపించారు దేశంలో హరిత విప్లవం విజయంవంతం చేయడంలో జగ్జీవన్ రామ్ కీలక పాత్ర పోషించాడు.1977 లో ఇందిరాగాంధి నియంతృత్వ విధానం ఆయన విభేదించారు అనంతరం కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు ప్రకటించి బయటికి వచ్చారు కేంద్రంలో మొరార్జీ దేశాయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర రక్షణ మంత్రిగా విధులు నిర్వహించారు.
1979 జనవరిలో డిప్యూటీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ఇలా వరుసగా 40 ఏళ్ల పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై ప్రపంచ స్థాయి రికార్డు సృష్టించారు అదే క్రమంలో వివిధ మంత్రి పదవులు చేపట్టి నవభారత నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించారు.
స్వాతంత్ర్యం పోరాటంలో జగ్జీవన్ రామ్ క్విట్ ఉద్యమంలో పాల్గొని పాట్నాలోని ఆయన స్వగృహంలో అరెస్టు అయ్యారు 1943 అక్టోబర్ లో బ్రిటిష్ ప్రభుత్వ అణచి వేతల్ని ఖండిస్తూ స్వాతంత్ర సాధన కోసం ,అనేక సభలు, సమావేశాలుర్యాలీలు ,విస్తృతంగా నిర్వహించారు.1946ఆగస్టు 30న భారతదేశంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా బ్రిటిష్ వైస్రాయి ఆహ్వానించిన 12మంది దేశం నాయకుల జాబితాలో జగ్జీవన్ రామ్ ఒకరు.భారతదేశ ప్రజల చేత బాబూజీ అన్న పిలుపు పొందిన గౌరవం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే దక్కింది.ఒకరు మహాత్మా గాంధీ కాగా మరొకరు
బాబు జగ్జీవన్ రామ్.గొప్ప దేశభక్తుడు దార్శినికుడు ,ఆయన నడిచిన బాట,ఆయన అనుసరించిన ఆదర్శాలు.చూపిన సంస్కరణ మార్గాలను గుర్తు చేసుకుంటూ ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అశోక్ అన్నారు.