Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Padmavati Reddy : దేశానికే ఆదర్శం సన్న బియ్యం పథకం.

–పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం.

–పేదల ఆకలి తీర్చే పథకం సన్న బియ్యం పథకం: పద్మావతి రెడ్డి.

Padmavati Reddy : ప్రజా దీవేన, కోదాడ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో సన్న బియ్యం లబ్ధిదారుడు షేక్ యాకుబ్ నివాసంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇంట్లో సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు కోదాడ నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ ఎన్నో పథకాలను తీసుకువచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు.

రైతు భరోసా, బోనస్ పథకాలతోపాటు దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పథకం అమలు చేసి ఉచిత బస్సు, ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్ వంటి పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ డిసిసి ఉపాధ్యక్షులు పారా సీతయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పందుల కోటేశ్వరరావు, తిప్పిరిశెట్టి సుశీల రాజు పాలూరి సత్యనారాయణ,గుండెల సూర్యనారాయణ,కాంగ్రెస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ యడవెల్లి బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.