Paris Olympics:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics)2024లో పాల్గొనే భారత ఆటగాళ్ల (Indian players) బృందానికి ప్రధాన స్పాన్సర్‌గా కార్పొరేట్ దిగ్గజం అదానీ గ్రూప్ (Adani Group) వ్యవహరిస్తుందని సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీ బుధవారం ప్రకటించారు. ఆటగాళ్లకు తమ మద్దతు పూర్తిస్థాయిలో ఉంటుంద ని పేర్కొన్నారు. ఈ క్రమంలో వారికి మద్దతుగా ప్రచారం ప్రారంభించి నట్లు వెల్లడించారు. దీంతోపాటు 1.45 నిమిషాల నిడివి గల ఓ వీడియోను కూడా సిద్ధం చేసింది. ఇందులో భారత్‌కు చెందిన ప్రతిభా వంతులైన అథ్లెట్లు శ్రమిస్తున్న వీడి యోలు ఉన్నాయి.
ఈనెల 26 నుం చే పారిస్ వేదికగా అంగరంగ వైభవంగా ఒలింపిక్స్‌ను (Olympics)నిర్వహిం చడానికి సన్నాహాలు పూర్తయ్యా యి. ఎప్పట్లాగే ఎన్నో ఆశలతో భారత బృందం కూడా వీటికి సిద్ధ మైంది. గతంతో పోలిస్తే ఈసారి ఒలింపిక్స్‌లో (Olympics) పోటీపడే అథ్లెట్ల సం ఖ్య తగ్గింది. షెడ్యూల్ ప్రకారం 2020లో కాకుండా కొవిడ్ కార ణంగా ఏడాది ఆలస్యంగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో 124 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకు న్నారు. ప్రస్తుతానికి పారిస్‌లో పోటీపడబోతున్న అథ్లెట్ల సంఖ్య 113 మందికి పరిమితమైంది.