Pastor Yesudas: ప్రజా దీవేన, కోదాడ: కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మర బండపాలెం నాలుగో వార్డ్ లో మంగళవారం సీయోను నివాస ప్రార్థన మందిర ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాస్టర్ యేసుదాసు పాల్గొని సీయోను నివాస ప్రార్థన మందిరం దైవ సేవకులు వంగూరు జాన్ పాల్ తో కలిసి ప్రతిష్టా కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రార్థనలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా పాస్టర్ ఏసుదాసు పరిశుద్ధ గ్రంథము బైబిల్ నుండి ఏసుప్రభు గురించి అనేక విషయాలు క్రైస్తవ భక్తులకు తెలియజేశారు ప్రత్యేక ప్రార్థనలతో గీతాలతో దేవునిని కీర్తించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ రూపస్ నాయక్. పాస్టర్ గోపిరెడ్డి. పాస్టర్ కిషోర్. పాస్టర్ శ్యామసుందర్. రుజువల్ టు పాస్టర్ గారు. పాస్టర్ జాన్ పాల్ గారు. పాస్టర్ ప్రశాంత్ . పాస్టర్ శ్యామ్. పాస్టర్ జోయల్. అనంతరం క్రైస్తవ భక్తులకు ప్రేమ విందు ఏర్పాటు చేసినారు