Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pawan Kalyan: ఆంద్రప్రదేశ్ కు చంద్రబాబు అపార అనుభవం అవసరం

–ఆయన అనుభవాన్ని వినియో గించాలి, లేదంటే తప్పు చేసినట్టే
–ఓజీ అంటే మోదీజీ గుర్తుకు వచ్చే ది, ఆయనతో మంచి రిలే షన్స్​ ఉన్నాయి
–వైసీపీని విమర్శించటం ఇష్టం లేదు,వాళ్లకు బూతులు, తిట్లు తెలుసు
–పల్లెల్లో వెలుగులు నింపాలి,
సమిష్టి కృషితోనే సత్ఫలితాలు
–ఉప ముఖ్యమంత్రి పవన్​ కళ్యాణ్​

Pawan Kalyan: ప్రజా దీవెన, విజయవాడ: ప్రజా ప్రతినిధులుగా ఉన్నంత కాలం పరిపాలన, రాజకీయాలను వేర్వే రుగా చూడాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవం ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) ఎంతో బలమని ఉప ముఖ్య‌మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెం దాలంటే ఎంతో అనుభవం ఉన్న నాయకుడు మ‌న‌కు అవసర మని,చంద్రబాబు వంటి నాయకుడి అనుభవాన్ని వినియోగించుకోవా ల‌ని, లేకపోతే తప్పు చేసినట్టే అవుతుంద‌ని ప‌వ‌న్ స్ప‌ష్టంచేశారు. అందుకే టీడీపీతో కలిసి కూటమి గా ఏర్పడ్డామని అన్నారు. పరిపా లనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)సోమ‌వారం ప్రారంభించారు. ప‌ల్లెల్లో వెలుగులు నింపాల‌ని, సంక్రాంతికి కొత్త క‌ళ సంత‌రించుకుని అంతా సంతో షంగా ఉండాల‌ని స్ప‌ష్టంచేశారు.

ఉపాధి హామీ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ₹4,500 కోట్ల వ్యయం తో 30 వేల పనులు, 8 లక్షల కుటుంబాలకు వందరోజుల ఉపాధి హామీ పని దినాలు, 3 వేల కిలో మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం, 25 వేల గోకులాల నిర్మాణం, 10 వేల ఎక రాల్లో నీటి సంరక్షణ కందకాలు తవ్వకం పనుల ప్రారంభ శిలాఫ లకాన్ని ఉపముఖ్యమంత్రి పవన్​ ఆవిష్కరించారు. కంకిపాడు పం చాయతీలో పల్లె పండుగ పంచా యతీ వారోత్సవాల్లో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 95.15 లక్షల రూపాయల అంచనా వ్య యంతో 11 అంతర్గత సిమెంటు రహదారులు రెండు మినీ గోకు లాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పునాదిపాడు గ్రామపంచా యతీలో రూ. 52 లక్షల అంచనా వ్యయంతో రెండు అంతర్గత రహ దారుల నిర్మాణానికి, పునాదిపాడు గ్రామంలో రూ. 54 లక్షల అంచనా వ్యయంతో సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభు త్వాన్ని పదేపదే విమర్శించడం తనకు ఇష్టం ఉండదని ఈ సంద ర్భంగా పవన్ అన్నారు.

వైసీపీ అధికారంలో ఉండగా ఎప్పుడైనా ప్రజా సమస్యలను (Public issues) పరిష్కరించారా అని ప్రశ్నించారు. “వైసీపీ హయాం లో151 మంది ఎమ్మెల్యేలు ఉండే వారు. వారెప్పుడైనా ప్రజల సమ స్యలపై ఇలా స్పందించారా ఎంత సేపు వారి నోటి వెంట బూతులు, తిట్లు తప్ప, ప్రజల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదని పవన్ విమర్శించారు.ప్రతి గ్రామం లో పనుల పురోగతి, నిధులు చెల్లింపుపై డిస్ ప్లే బోర్టులు ఏర్పా టు చేశాం. మేము పారదర్శకంగా ఉన్నప్పటికీ.. అధికారులు కూడా బాగా పని చేయాలి. ఓ ఐఎఫ్‌ఎస్ అధికారి నా పేరు చెప్పి డబ్బులు అడగినట్లు తెలిసింది. నా దృష్టికి రాగానే విచారణ చేసి, అవసరమై తే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశాం. అవినీతి అధికారులు మాకు వద్దు. ఎవరు లంచం పేరు తో ఇబ్బంది పెట్టినా మా దృష్టికి తీసుకురండి. మేము ప్రజలకు సేవ చేయడానికే వచ్చాం.. అభివృద్ధి చేయడం మా బాధ్యత. కంకిపా డులో కూడా డిస్ ప్లే బోర్డులు ఉంటా యి. ప్రజలందరు వివరాలు తెలుసుకోవచ్చు. దేశ చరిత్రలో గ్రామ సభలు, అభివృద్ధి పనులు ఒకేసారి జరగడం ఏపీలోనే చూస్తు న్నాం. అన్ని గ్రామ పంచాయతీ వారోత్సవాలలో పనులు ఇవాళ ప్రారంభం అయ్యాయి. పనులు పూర్తి కావాలంటే.. సంబంధిత శాఖల అధికారులు సమన్వ యంతో పని చేయాలన్నారు.

పరిపాలన ఎలా చేయాలనే అంశంలో నాకు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్పూర్తి. క్యాబినెట్ సమావేశాల్లో చంద్రబాబు బలంగా మాట్లాడతారు. అధికారులు లేవనెత్తే సందేహాలకు కూడా బాబు చెప్పే సమాధానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. పంచాయతీరాజ్ శాఖలో 30 వేల పనులు చేయాలంటే ఎన్నో శాఖల సహకారం, సమన్వయం తప్పని సరి. ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకు చిత్తశుద్ధి ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. అధికారులు సమన్వయంతో పని చేసి లక్ష్యాలను చేరుకున్నందుకు అభినందనలు. జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర అభివృద్దిలో కీలకమైనది. ఏటా రూ.10వేల కోట్ల నిధులు జాతీయ ఉపాధి హామీ పథకం కింద వస్తాయి. మీ ప్రాంత ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎలా పని చేస్తారో మీ అందరికీ తెలుసు. కంకిపాడు నుంచి రొయ్యూరు వరకు ఉన్న రోడ్డును సుందరీకరించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎదురుమొండి నుంచి గొల్లమంద వరకు బ్రహ్మ య్యగారి లంక గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఉందని చెప్పారు. కలెక్టర్ బాలాజీ సహా ఎమ్మెల్యేలు ఈ సమస్యను నా దృష్టికి తీసుకు వచ్చారు. లంక గ్రామాలలో ఉన్న కనెక్టివిటీ రోడ్లు వేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారు లను ఆదేశిస్తున్నామని పవన్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల సమస్యలే అజెండాగా ఎమ్మెల్యేలు (mla) పని చేస్తున్నారు. ఊరి అభివృద్ధి కోసం జరుపుకుంటున్న పల్లె పండుగతో గ్రామాల్లో అభివృ ద్ధి చూస్తాం. వంద రోజుల ఉపాధి హామీ పథకంతో ఆర్ధికంగా ఎదగా లి. ఆగస్టు 23న ఆమోదించిన అన్ని పనులకు కలెక్టర్లు అనుమ తులు ఇచ్చారు. ఇవాళ పండుగ వాతావరణంలో భూమి పూజ చేసుకున్నాం. సంక్రాంతి నాటికి పనులన్నీ పూర్తి చేసి, మరోసారి పల్లెల్లో పండుగ చేసుకుందామని పవన్ చెప్పారు.ప్రధాని మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. “ప్రధాని మోదీతో నాకు సన్నిహిత సంబం ధాలు ఉన్నాయి. అలా అని తర చూ వెళ్లి కలవలేను. కోనసీమలో రైల్వే కూత వినిపించాలని ప్రజల కోరిక. బాపట్ల, మచిలీపట్నం, కోన సీమ ప్రాంతాల సమస్యలను మోదీ దృష్టికి తీసుకెళ్తా. నేను మాట ఇస్తే నిలబడే వ్యక్తిని ఎమ్మెల్యే బోడే ప్రసా ద్ (Bode Prasad)కొన్ని సమస్యలు చెప్పారు. అందరిలా చేసేద్దాం అని మాటలు చెప్పను. అందుకే అధికారులతో మాట్లాడి సమస్యలకు పరిష్కారం వెతుకుతాను. అన్నారు. ఓజి ఓజి అంటూ అభిమానులు నినాదాలు చేస్తున్నారు. నాకు చాలా కాలం ఓజి అంటే మోదీ అని వినిపించేది. ఆ తరువాత ఓజి అని అర్థం అయ్యిందని చమత్కరించారు.

ముందుగా రోడ్లు, మన ప్రాంతాలు బాగు చేసుకుందాం. ఆ తరువాత వినోదాన్ని ఆస్వాదిద్దాం. నాయ కుడిగా, హీరోగా నన్ను అభిమా నిస్తారు. నాతోటి హీరోలందరిలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి అందరు హీరోలు బాగుండాలి, మంచి సినిమాలు‌చేయాలి. ముందు బాధ్యతతో పని చేయాలి. ఆ తరువాత వినోదం తప్పకుండా ఉంటుంది. అని పవన్ కళ్యాణ్ వివరించారు. కూటమి ప్రభు త్వంలో ప్రజల సమస్యలే అజెం డాగా ఎమ్మెల్యేలు పని చేస్తు న్నారు. ఊరి అభివృద్ధి కోసం జరుపుకుంటున్న పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి చూస్తాం. పవన్ కళ్యాణ్ దగ్గరే డబ్బులు ఉన్నాయని చంద్రబాబుకు అధికారులు‌ చెప్పారట. నేను ఆరా తీస్తే ఉపాధి హామీ పథకం ద్వారా ఏడాదికి వచ్చే రూ.పది వేల‌ కోట్ల నిధుల గురించి మాట్లాడినట్లు తెలిసిందని పవన్ అన్నారు.