Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pawan Kalyan: ఎదురుమొండి, గొల్లమంద రహ దారి నిర్మాణానికి

–ఏ.ఐ.ఐ.బి. గ్రాంట్ రూ.13.45 కోట్ల ద్వారా నిర్మాణం
–కృష్ణా తీరంలో కోత నిరోధానికి 700 మీటర్ల మేర ఆర్.సి.సి. పా ర్కు
–తక్షణమే పనులు చేపట్టాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం

Pawan Kalyan: ప్రజా దీవెన, విజయవాడ: కృష్ణా జిల్లా నాగాయలంక మండ లంలో ఎదురుమొండి, గొల్లమంద రోడ్డు ఇటీవలి భారీ వరదలతో ఛిద్ర మైంది. ఈ రోడ్డు పునర్నిర్మాణానికి రూ.13.45 కోట్లు వ్యయంతో అం చనాలను రాష్ట్ర ఉప ముఖ్యమం త్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముందు ఉంచారు. ఈ రోడ్డు పరిస్థి తిపై కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, పంచాయతీరాజ్ ఈ.ఎన్.సి. బాలు నాయక్ (Balu Naik) వివరించారు. ఎదురు మొండి నుంచి గొల్లమంద వయా బ్రహ్మయ్యగారి మూల రోడ్డు కృష్ణా నది వెంబడి ఉంటుందని, నది స ముద్రంలో కలిసే ప్రాంతానికి దగ్గ రలో ఉన్న రోడ్డు కావడంతో తుపా న్లు, వరదల సమయంలో బ్యాక్ వాటర్స్ రోడ్డును బలంగా తాకు తుంటాయని తెలిపారు. ఫలితంగా రోడ్డు దెబ్బ తింటోందని, ఇటీవలి భారీ వరదలకు 700 మీటర్ల మేర కోతకు గురైందన్నారు.

8 వేల ఎకరాలు కాపాడవ చ్చు …ఈ రోడ్డు నిర్మాణానికి ఇప్ప టికే ప్రణాళికలు చేసి, రూ.4 కోట్ల తో అంచనాతో మంజూరై పనులు ప్రారంభ దశలో ఉన్నాయని అయి తే భారీ వరదల (Massive floods) మూలంగా ధ్వంసం కావడంతో రోడ్డు మొత్తం తిరిగి నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కోతకు గురైన ప్రాంతం లో 700 మీటర్ల మేర తిరిగి ఆ పరి స్థితి రాకుండా తీరం వెంబడి ఆర్. సి.సి. పర్కుపైన్స్ వేస్తామని ఆ తర వాత రోడ్డు నిర్మిస్తామని వివరించా రు. ఈ విధంగా రోడ్డు నిర్మిస్తే భవి ష్యత్తులో ఆ ప్రాంతంలో కోతకు గురై, గండి పడకుండా చేయవ చ్చని, తద్వారా 8 వేల ఎకరాల ను, 12 వేల జనాభాను కాపాడ వచ్చని తెలిపారు. ఈ రోడ్డు పున ర్నిర్మాణాన్ని ప్రాధాన్య అంశంగా తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సవరించిన అంచ నాలతో కూడిన నివేదికను సత్వర మే పంపించాలని, వ్యయాన్ని ఏ. ఐ.ఐ.బి. గ్రాంట్ (A. I.I.B. Grant) నుంచి తీసుకో వాలని ఈ.ఎన్.సి.కి దిశానిర్దేశం చేశారు.

ఫంట్ల పరిస్థితిపై నివేదిక పంపండి …ఏటిమోగ నుంచి ఎదురుమొండి, అక్కడి దీవిలోని ఇతర పల్లెలకు ప్రజల రాకపోకల సౌకర్యం కోసం మెరుగైన ఫంట్లు అందించడానికి కార్పొరేట్ సామా జిక బాధ్యత (Social responsibility) నిధుల ద్వారా సా యం పొందే విషయమై జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసు కోవాలని తన కార్యాలయ అధికా రులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఫంట్లు సామర్థ్యం, తీసుకొం టున్న భద్రత చర్యలు, వాటి అమ లుపై నివేదిక ఇవ్వాలని కృష్ణా జి ల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఏటి మోగ నుంచి ఎదురుమొండి వరకు వంతెన నిర్మాణం అత్యవసర ఆవ శ్యకతను రోడ్లు మరియు భవనాల శాఖకు తెలియజేయాలని ఉప ముఖ్యమంత్రి నిర్ణయించారు.