–కొండగట్టు అంజన్న స్వామిని ద ర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
–కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు
–ఎన్నికల ప్రచార సమయంలో వారాహికి ఇక్కడే పూజలు
Pawan Kalyan: ప్రజాదీవెన, కొండగట్టు: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కొండగట్టు అంజన్న స్వామిని (Kondagattu Anjanna Swamy) దర్శించుకోనున్నారు. కొండగట్టు అంజన్నకు పవన్ కల్యాణ్ మొక్కులు తీర్చుకోనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నివాసం నుంచి బయలుదేరిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కొండగట్టుకు చేరుకున్నారు. రోడ్డు మార్గాన కొండగట్టుకు వెళ్లటిన పవన్‌కల్యాణ్ కు .. అభిమానులు పలు చోట్ల ఘన స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హైదరాబాద్ కు రానున్నారు. ఎన్నికల ముందు వారాహి వాహనానికి పూజలు చేసిన పవన్ కల్యాణ్ ముడుపులు కట్టారు. ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం (deputy cm) హోదాలో పవన్ కల్యాణ్ తొలిసారి కొండగట్టు అంజన్న దేవాలయానికి రానున్నారు. పూజల అనంతరం కొండగట్టు నుంచి ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాక సందర్భంగా కొండగట్టులో పోలీసులు భారీ భద్రతా (Huge security) ఏర్పాట్లు చేస్తున్నారు.