Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pawan Kalyan: పవర్ స్టార్ కీలక వ్యాఖ్యలు, జల్ జీవన్ మిషన్ లో రూ. 4 వేల కోట్లు దుర్వినియోగం

ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభు త్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పిం చారు. జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు దుర్వి నియోగం చేసిందని కీలక వ్యాఖ్యలు చూస్తూ ఆరోపణలు చేశారు. విజయవాడలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో పవన్ మాట్లాడుతూ ఈ వ్యా ఖ్యలు చేశారు. జల్ జీవన్ మిషన్ ను మరింత బలోపేతం చేస్తామని పవన్ తెలిపారు.

నీటి సమస్యతో అనేక మంది ఇబ్బంది పడుతు న్నారని ఈ సమస్య పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని చెప్పారు. జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకుని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తామని తెలిపా రు. ప్రతి ఒక్కరికీ నిరంతరం పరి శుభ్రమైన నీటిని అందించాలనే ఆకాంక్షతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమయిందని చెప్పారు. ప్రతి మనిషికి రోజుకు సగటున 55 లీట ర్ల పరిశుభ్రమైన నీరు ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 70 వేల కోట్లు మం జూరు చేయాలని కేంద్రాన్ని కోరిన ట్టు చెప్పారు.