–తిరుమల శ్రీవారిని దర్శించుకు న్న ఉపముఖ్యమంత్రివర్యులు పవ న్ కళ్యాణ్
–స్వామి వారికి ప్రత్యేక పూజలు.. శ్రీవారి పాదాల చెంత పవన్ కళ్యా ణ్ వారాహి డిక్లరేషన్
–మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరణ
Pawan Kalyan: ప్రజా దీవెన, తిరుమల: సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి (Tirumala Sri Venkateswara Swamy) దర్శనం చేసు కుని దీక్ష విరమించారు. 11 రోజులపాటు సాగిన ఆయన దీక్ష లో భాగంగా ఇటీవల చోటు చేసు కున్న కొన్ని పరిణామాల నేపధ్యం లో సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత భుజాలకెత్తుకుని ప్రాయ శ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలి సిందే.మంగళవారం రాత్రికి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరు మల చేరుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బు ధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శ న సమయంలో తన ఇద్దరు కుమా ర్తెలు ఆద్య కొణిదెల, పలీనా అంజ ని కొణిదెలలతో కలసి మహాద్వా రం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు. తన ఇద్దరు కుమార్తెలతో స్వామి వారి దర్శనానికి వెళ్లిన పవన్ ప్రత్యే క పూజలు చేసి వారాహి డిక్లరేషన్ ని స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నా రు. అనంతరం ఆలయ ప్రాంగణం లోని శ్రీ రంగనాయకుల మండపం లో వేద పండితులు పవన్ కి ఆశీ ర్వ చనం చేసి స్వామి వారి చిత్రప టంతో పాటు తీర్థ ప్రసాదాలు అంద జేశారు.
స్వామి వారి దర్శనం అనం తరం పవన్ కళ్యాణ్ నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వ హిస్తున్న మాతృశ్రీ తరిగొండ వెంగ మాంబ నిత్యాన్నదాన కేంద్రాన్ని సందర్శించారు. అన్నదాన కేంద్రం లోనూ ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారు. భక్తులకు జరుగుతున్న అన్నదాన (food)సరళిని పరిశీలించారు. అనంతరం సామాన్య భక్తులతో కలిసి అన్నప్ర సాదం స్వీకరించారు. దర్శనానికి ముందు చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెలతో డిక్లరేషన్ ప్రక్రి య పూర్తి చేయించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అం జనితో స్వయంగా డిక్లరేషన్ ఇప్పిం చారు. కుమార్తె మైనర్ కావడంతో తండ్రిగా పవన్ క డిక్లరేషన్ ఫాంపై సంతకం చేశారు. పవన్ కళ్యాణ్ (pawan kalyan)రితో పాటు శాసన మండలి సభ్యు లు పిడుగు హరిప్రసాద్ , తిరుపతి, రైల్వే కోడూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు , అరవ శ్రీధర్ , ప్రముఖ సినీ దర్శకులు త్రివిక్రమ్ , కళా దర్శకులు ఆనంద సాయి స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
ఇక శ్రీవారిని దర్శించుకున్న సమయంలో వారాహి డిక్లరేషన్ బుక్‌ను (Declaration Book)శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు పవన్ కల్యాణ్.. స్వామివారి దర్శనం. దీక్ష విరమణ తర్వాత వారాహి డిక్లరేషన్ బుక్‌ను (Declaration Book) ఆలయం వెలుపల మీడియాకు చూపించారు పవన్.. దీంతో.. వారాహి డిక్లరేషన్ బుక్‌లో (Declaration Book) ఏముం దు? అనే చర్చ సాగుతోంది.. రెడ్ కలర్‌లో ఉన్న ఆ బుక్ కవర్ పేజీపై.. పై భాగంలో ధర్మో రక్షతి రక్షితః !!.. మధ్యలో వారాహి అమ్మవారి చిత్రం.. ఆ తర్వాత వారాహి డిక్లరేషన్.. కింది భాగంలో తిరుపతి 03-10-2024 అని రాసుకొచ్చారు.. దీంతో.. ఆ బుక్‌లో ఎలాంటి అంశాలు పొందుపర్చార నేది ఆసక్తికరంగా మారింది. అయి తే, రేపటి వారాహి సభలో వారాహి డిక్లరేషన్ బుక్‌లోని అంశాలను ప్రజ లకు పవన్ కల్యాణ్ తెలియజే స్తారని జనసేన శ్రేణులు చెబుతు న్నాయి. కాగా, రేపు సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని బాలాజీ కాలనీ సర్కిల్, ఎస్వీ మ్యూజిక్ కాలేజీ దగ్గర ఎస్వీయూ క్యాంప్ స్కూల్‌లో వారాహి బహిరంగ సభను (Varahi public meeting) జరగనుంది. ఈ బహిరంగ సభలో వారాహి వాహనం నుంచి జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నా రు.