–ఎన్డీఎ కూటమి ఎమ్మెల్యేలతో చంద్రబాబు
–అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భేటి
–శాండ్ పాలసీలో ఎమ్మెల్యేల జో క్యం చేసుకోవద్దు
–కవ్వింపు చర్యలకు ఎవరూ పాల్ప డవద్దన్న పవన్ కల్యాణ్
Pawan Kalyan: ప్రజా దీవెన,అమరావతి: ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో (assembly)అనుస రించాల్సిన వ్యూహాలపై సీఎం చంద్రబాబు (Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లు తమ కూటమి ఎమ్మెల్యేలకు దిశ నిర్దేశం చేశారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీఏ సభ్యులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరిం చాల్సిన విధివిధానాలపై ఎమ్మె ల్యేలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. గడిచిన ఐదేళ్లు వైసీపీ పెట్టిన ఇబ్బందులని సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యేలు.
దీనిపై చంద్రబాబు (Chandrababu) స్పందిస్తూ.. ఈ విషయాంపై చట్ట ప్రకారం ముందుకెళ్దామని, చట్టం తన పని తను చేస్తుందంటూ సీఎం చెప్పారు. సాండ్ పాలసీలో (Sand Policy) ఎవరు జోక్యం చేసుకోవద్దంటూ సూచించారు. కలిసికట్టుగా అందరూ కలిసి పనిచేయాలంటూ దిశా నిర్దేశం చేశారు.ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ కవ్వింపు చర్యలకు పాల్పడద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (pawan kalyan)సూచించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వేసే కమిటీల్లో అన్ని పార్టీలను కలుపుకోవాలని కోరారు.