Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యూ.ఎస్. కాన్సల్ జనరల్ భేటీ

Pawan Kalyan:ప్రజా దీవెన, అమరావతి: ఆంద్రప్ర దేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివ ర్యులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో యూ.ఎ స్. కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్స న్ (U.A.S. Consul General Jennifer Larson)మర్యాదపూర్వకంగా భేటీ అ య్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు తెలియచేసి జ్ఞాపిక అందచేశారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ గారి నివాసంలో ఈ సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ నీ, ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబ డులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు చర్చకు వచ్చాయి.

రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో (Political stability in the state) కూడిన ప్రభుత్వ పాలన ఉందనీ, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని ఉప ముఖమంత్రి తెలిపారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా (America)వెళ్ళేవారికీ తగిన సహకారం, మార్గనిర్దేశనం అందిం చాలని కోరారు. పర్యావరణహిత మైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో యూ.ఎస్. కాన్సల్ పొలిటికల్, ఎకనామిక్స్ విభాగం చీఫ్ ఫ్రాంక్ టాలుటో, ఆ విభాగం ప్రతినిధులు శ్రీ శ్రీమాలి కారే, సిబప్రసాద్ త్రిపాఠి పాల్గొన్నారు.