PDSU : అక్టోబర్ 24న జరిగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రస్తుత విద్యార్థుల (Past and present students)సభను విజయవంతం చేయాలని సంబంధించిన పి డి ఎస్ యు గోడ పత్రికలను ఆదివారం పట్టణంలోని స్థానిక ఎమ్మెస్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు అనంతరం పూర్వ విద్యార్థి నాయకులు (Alumni Leaders) మాట్లాడారు ఉస్మానియా క్యాంపస్లో మతోన్మాద ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆర్ఎస్ఎస్ గుండాలతో ప్రాణాలకు తెగించి పోరాడిన చేగోర జార్జి విద్యార్థి ఉద్యమ నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ వారి ప్రాణ త్యాగాలతో PDSU దేశవ్యాప్తంగా విస్తరించబడింది తెలిపారు. విద్యార్థుల సమస్యల (Students problem) పైన కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థానిక సమస్యలపై విద్యార్థు లను ప్రజానీకాన్ని ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ మానవీయ కోణంలో విద్యా విలువలను పెంపొందించడంలో పిడిఎస్యు ఘనమైన చరిత్రను (History)కలిగి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఇట్టి కార్యక్రమంలో రాయపూడి వెంకటేశ్వర్లు చిన్ని, ముత్తవరపు పాండురంగారావు, రాఘవరెడ్డి,పందిరి నాగిరెడ్డి , అప్పిరెడ్డి, రాంబాబు,రాపర్తి రామ నరసయ్య, డీఎన్ స్వామి, డి వెంకటేశ్వరరావు, వక్కంతుల నరసింహారావు,హరికిషన్, వీరభద్రం, మల్లయ్య,రంజాన్, పాషా , బాబూరావు,బడుగుల సైదులు, ఎస్కే మస్తాను, ఎస్ బిక్షం, , సిహెచ్ బిక్షం, చందర్రావు, ఉదయగిరి, కిరణ, సింహాద్రి, తదితరులు పాల్గొన్నారు.