–పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు
Peddireddy Ramachandra Reddy:ప్రజాదీవెన, అమరావతి: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై (Peddireddy Ramachandra Reddy) ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు (Registration of SC and ST cases)చేయాలంటూ ఓ ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. చిత్తూరు జిల్లా ఎస్సీఎస్టీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల సర్టిఫైడ్ కాపీలను పిటిషన్ర్కు (petitioner) అందజేయడంలో చోటు చేసుకున్న జాప్యంపై నివేదిక తెప్పించుకుంటామని హైకోర్టు తెలిపింది. దిగువ కోర్టు ఇప్పటికే ఇచ్చిన నివేదికపై స్పందన తెలపాలని పిటిషనర్‌కు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం సూచించింది.
ఎస్సీఎస్టీ కోర్టు సర్టిఫైడ్ కాపీ అందజేయడంతో తీవ్ర జాప్యాన్ని సవాల్ చేస్తూ మాజీ జడ్జి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఎస్సీఎస్టీ కోర్టు న్యాయాధికారి ఇచ్చిన నివేదికను సీల్డ్ కవర్లో (Sealed cover)ధర్మాసనానికి అందజేశామని న్యాయవాది కుంచెం మహేశ్వరరావు తెలిపారు. మరోవైపు పిటిషనర్ తరఫు న్యాయవాది బి.బాలయ్య వాదనలు వినిపిస్తూ ధ్రువపత్రాల(సర్టిఫైడ్ కాపీల) కోసం తాము దాఖలు చేసిన అప్లికేషన్ తారుమారు చేశారన్నారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 13కి వాయిదా వేసింది.