–ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ని రంతరం సాధన చేయాలి
–విజయం సాధించిన వారిని స్పూ ర్తిగా తీసుకోవాలి
–తల్లిదండ్రులకు ఆసరాగా ఉండా లి, మంచి స్థాయికి ఎదగాలి
–శారీరకంగా, మానసికంగా దృఢం గా ఉండాలి
–సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ
SP Narasimha : ప్రజాదీవెన, సూర్యాపేట: సూర్యాపే ట రూరల్ పరిధి బాలెంల గ్రామ శి వారులోని తెలంగాణ గురుకుల సో షల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల నందు పోలీసు ప్రజాభరోసా కార్య క్రమంలో భాగంగా సైబర్ మోసాల పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పా టు చేయడం జరిగింది. ఈ కా ర్య క్ర మంలో జిల్లా ఎస్పీ నరసింహ ము ఖ్య అతిథిగా హాజరై ఉన్నత లక్ష్యా లు, విజయాలు సాధించడం, సైబర్ మోసాలు, మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూల మొదలగు అంశాల గురిం చి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మంచి ఆలోచనలకు ఆదిలోనే పు నాది వేయాలని, వ్యక్తిగత క్రమశిక్ష ణ, వ్యక్తిగత సాధన ఉండాలి అ న్నారు. ఉన్నత స్థాయికి చేరుకో వ డానికి నిరంతర కృషి, నిరంతర సా ధన చేయాలని, విజయం సాధిం చిన వారి వ్యక్తిగత జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. మంచి వ్యక్తిత్వం అలవర్చుకోవా ల ని తల్లిదండ్రులకు ఆసరాగా ఉం డాలని, మంచి స్థాయికి చేరుకోవా లని కోరారు. తల్లిదండ్రులు నాటిన మొక్కలని మొక్కలు ఎదిగి సమా జానికి ఫలాలు ఇచ్చే లాగా ఉం డాలని ఆకాంక్షించారు.
సమస్యలకు కుంగిపోవద్దని శారీ ర కంగా మానసికంగా దృఢంగా ఎద గాలని ప్రతిఅవకాశాన్ని సద్విని యోగం చేసుకొని విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తప్పుల ని అధిగమిస్తూ విజయాల వైపు వె ళ్లాలని మంచి పుస్తకాలను మంచి స్నేహితులను ఎంచుకోవాలని అ న్నారు, మన చుట్టూ చేరే కలుపు మొక్కలను గుర్తించాలని అన్నారు.
సమాజంలో సైబర్ మోసాలు అ త్యంత ప్రమాదకరంగా ఉన్నాయని సైబర్ మోసాల నివారణలో నేటి పౌరులు రేపటి సైబర్ మోసాల ని వారణ వారియర్స్ గా పని చేయాలి అన్నారు. మొబైలు ఇంటర్నెట్ ద్వా రా జ్ఞానాన్ని పొందాలెతప్ప సోషల్ మీడియా ప్రభావానికి గురికావద్దని అన్నారు. సైబర్ మోసగాళ్లు ఆన్లైన్ వ్యాపారం పేరుతో మోసాలకు పా ల్పడుతున్నారని ఆన్లైన్ వ్యాపారం పేరు చెప్తే ఎవరు నమ్మి పెద్దమొత్తం లో డబ్బులు పెట్టుబడులు పెట్టవ ద్దని ఆర్థికంగా నష్టపోవద్దని కోరా రు. అలాగే ఇంటర్నెట్ కాల్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇంస్టాగ్రామ్ ద్వారా లింకులు పంపించి మోసాలకు పాల్పడుతున్నారని వీటి మోసాల గురించి తల్లిదండ్రులకు మీ చుట్టు పక్కల ఉన్న వారికి తెలియజేయా ల్సి ఉన్నది సైబర్ వారియర్స్ గా ఉండాలన్నారు.
డిజిటల్ అరెస్ట్ అనేది అబద్ధమని డిజిటల్ అరెస్ట్ అంటూ ఎవరైనా అ పరిచితులు ఫోన్ చేసి ఎస్బి, సిబి ఐ, సిఐడి దర్యాప్తు సంస్థల పేర్లు చె బుతూ మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాము అంటే నమ్మవద్ద న్నా రు. అలాగే డ్రగ్స్ అత్యంత ప్రమా దకరంగా ఉన్నాయని యువత వీటి బారిన పడి మంచి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు అన్నా రు. ఈ డ్రగ్స్ కు దూరంగా ఉండి మంచి అలవాటు మంచి స్నేహితు లను కలిగి ఉండాలని సూచించా రు.
పోలీసు కళాబృందం వారు సా మా జిక అంశాల గురించి సామాజిక రు గ్మతల గురించి సామాజిక భద్రత గురించి పాటలతో అవగాహన క ల్పించారు. ఈ కార్యక్రమంలో సూ ర్యాపేట రూరల్ ఇన్స్పెక్టర్ రాజశేఖ ర్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామా రావు సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనా రాయణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ఆత్మకూరు ఎస్సై శ్రీకాంత్, సూర్యా పేట రూరల్ ఎస్సై వెంకట్రాములు, షీ టీమ్స్ ఎస్సై నీలిమ, పోలీసు క ళాబృందం, పోలీసు సిబ్బంది వి ద్యార్థులు ఉన్నారు.
