Petrol Rates : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: కరోనా తరవాత సొంత వాహనాల వాడ కం పెరిగింది. బ్యాంకులు సులు వుగా రుణాలు ఇవ్వడంతో పాటు, వాహనం అన్నది వ్యక్తిగత అవసరంగా మారడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ టూవీలర్, ఫోర్ వీలర్లను కొనుగోలు చేస్తున్నారు. ఉన్నంతలో తమ ఖర్చులను తగ్గించి ఇందుకు సాహిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యతరగతి వారిపై వాహన, పెట్రో,డీజిల్ ఖర్చులు అదనం అవుతున్నాయి. అదే క్రమంలో రిజిస్టేష్రన్ ధరలు ఇతరత్రా ఖర్చులు పెరుగుతున్నాయి. నిజానికి ప్రభుత్వం సొంతంగా ఇళ్లు కొనుక్కోవాలనుకునే వారికి, కట్టుకునే వారికి అనుగుణంగా రుణాలు ఇచ్చేలా నిబంధనలు సడలించాలి. వాహనాలు, ఇంటి రుణాలపై వడ్డీలు, రిజిస్టేష్రన్లు తగ్గించాలి. ఇది ఓరకంగా ప్రోత్సాహకరంగానూ ఉంటుంది. వ్యాపారం అభివృద్ది చెందుతుంది. అలాగే పెట్రో,డీజిల్ ధరలు కూఆ అందుబాటులోకి రావాలి. పెట్రో ధరలకే ఇవి వాహనాలు అందుబాటులోకి వస్ఆయిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు కొంత ఉత్సాహాన్ని ఇచ్చేదే. అయితే దేశీయంగా ఇందన రంగాన్ని ప్రోత్సహించాల్సి ఉంది. సోలార్ పవర్ పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. దీంతో విద్యుత్ ఖర్చులు, ఇంధన ఖర్చులు తగ్గుతాయి.
బయోడీజిల్ ఉత్పత్తికి అవసరమైన కానుగ చెట్ల పెంపకం అంటూ దివంతగ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఎంగా ఉన్న సమయంలో హడావిడి జరిగింది. కానుగ చెట్ల పెంపకానికి ప్రోత్సాహకాలు ఇచ్చారు. అయితే ఆ తరవాత ఏమయ్యిందో ఏమో గానీ దీని ఊసేలేకుండా పోయింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల గురించి పరిశోధనలు ఏ మేరకు జరుగుతున్నాయో కానీ.. ఇంధన వనరుల కోసం మనం విదేశాలపై ఆధారపడుతున్నాం.
లాటిన్ అమెరికా దేశం భారీ పరిమాణంలో చెరకు దిగుబడులను సాధిస్తోంది. ఆ చెరుకు నుంచి నేరుగా బయోడీజిల్‌ను ఉత్పత్తి చేస్తోంది. నేల, నీరు అపారంగా ఉన్న కారణంగా, ఆహార భద్రతపై ఎటువంటి ప్రభావం లేకుండా ఆ సహజ వనరులలో గణనీయమైన భాగాన్ని బయోడీజిల్ ఉత్పత్తికి వినియోగించుకునే వెసులుబాటును పరిశీలించాలి. ఆహారోత్పత్తికి భంగం వాటిల్ల కుండా.. బయోడీజిల్ ఉత్పత్తికి నిరుపయెగంగా ఉన్న భూముల ను వినియోగిస్తే ఫలితం ఉంటంది. బయోడీజిల్ ఉత్పత్తికి చెరుకును మరింతగా ఉత్పత్తి చేయడం వల్ల అధికాదాయం లభిస్తుంది.ఇకపోతే చక్కెర ఉత్పత్తికి వినియోగించుకున్న అనంతరం మిగిలే చెరుకు పిప్పిని విద్యుదుత్పత్తికి వినియోగించు కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వరి, గోధుమ పంటల సాగుతో కూడా మనకు ఎండుగడ్డి అపారంగా సమకూరుతుంది. దానిని పశుగ్రాసంగా మాత్రమే కాకుండా విద్యుదుత్పత్తికి కూడా బాగా వినియోగించు కోవచ్చు. అలాగే కాగితాల తయారీ మొదలైన ఇతర ప్రయోజ నాలు కూడా ఎండుగడ్డితో సమకూరుతాయి. కనుక వివిధ ఉపయోగాలు ఉన్న కారణంగా ఎండుగడ్డిని ఉత్పత్తి చేసుకోవడమే మనకు అనేక విధాలుగా లాభకరమైన వ్యవహారం. ప్రస్తుత ఇంధన సంక్షోభ సమయంలో మనం పలురకాల ప్రత్యమ్నాయాలను ఆలోచనచేయాలి. సమస్యను అధిగమించేందుకు ఇంధన వినియోగాన్ని మరింతగా తగ్గించే విషయమై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. సంపన్నులు, సామాన్యులను అందుకు అనుగుణంగా ప్రోత్సహించాలి. దీంతో పర్యావరణం కూడా పరిరక్షించుకోగలం. మన అవసరాల మేరకు…మనకున్న భూమిని,నీటిని ఉపయోగించు కుని ఉత్పత్తులు పెంచుకోకుంటే భవిష్యత్‌లో ఇంతకన్నా దుర్భర పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు.
బయోడీజిల్ ఉత్పత్తికి భారీ పరిమాణంలో నీరు అవసర మవుతుందన్న వాదనా ఉంది. ఒక హెక్టారు భూమిలో చెరకుసాగుకు, గోధుమసాగు కంటే 20రెట్లు అధికంగా నీరు అవసరమవుతుంది. మరి మన జలవనరులు ఇప్పటికే బాగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు ఏయేటి
కాయేడు తగ్గిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చెరుకు సాగుకు మరింతగా భూగర్భ జలాలలను వాడు కుంటే భూగర్భ జలమట్టం మరింతగా పడిపోతుందన్న వాదనా ఉంది. ఈ పరిస్థితి తప్పకుండా మన ఆహార భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని కొందరు హెచ్చరిస్తున్నారు. జీవ ఇంధనాలను ప్రోత్సహించడం అవసరమన్న ఆలోచనచేయడం లేదు. ఇక తాజా పరిస్థితులను పరిశీలిస్తే ఉక్రెయిన్‌లో యుద్ధం ఇంధన చమురు ధర పెరుగుదలకు దారితీసింది. యుద్ధం కొనసాగిన పక్షంలో చమురు ధరలు మరింతగా పెరిగే ప్రమాదం ఎంతైనా ఉంది. తాజాగా పెరిగిన ధరల తీరు చూస్తుంటే ఈ ధరల మోత ఇక ముందు కూడా ఆగదని స్పష్టం అవుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలలో ఇంధన భద్రతను సమకూర్చుకోవల్సిన అగత్యాన్ని హెచ్చరిస్తోంది.
ఈ పరిణామాల క్రమంలో దేశంలోని పాలకులు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాలి. మూడు ప్రధాన ఇంధన వనరులు చమురు, బొగ్గు, యురేనియం దిగుమతులపై మన ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. జీవ ఇంధనాలను ప్రోత్సహించడం ఒక ప్రత్యామ్నాయ మార్గమని పలువురు సూచిస్తున్నారు. చెరుకు నుంచి, సారహీన నేలల్లో పెరిగే జట్రోఫా మొక్కల విత్తనాల నుంచి జీవ ఇంధనాలను ఉత్పత్తి చేసుకోవచ్చని కూడా అంటున్నారు. సారహీన అంటే చౌడు నేలలను ఉపయోగించు కోవడం ద్వారా జీవ ఇంధనాల ఉత్పత్తిని ఇతోధికంగా పెంచుకోవడం సాధ్యమవుతుంది. అలాగే సోలార్ పవర్‌పై మరింత విస్తృతంగా పరిశోధనలు జరగగాలి. విద్యుత్ ఉత్పత్తిని పెంచుకుని, వాహనాలకు విద్యుత్ వాడకాన్ని ఉపయోగించేలా యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. దేశ శ్రేయస్సు దృష్ట్యా మాత్రమే బయోడీజిల్ మొదలైన జీవ ఇంధనాలను ప్రోత్సహించాలి. అందుకు అవసరమైన పరిశోధనలు జరగాలి. దీని ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలి.