Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Phone tapping: నేతల వాంగ్మూలాలు.. అనేక మలుపులు

— ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు
–ట్యాప్ సమాచారం తప్ప మిగిలిన డేటాను ధ్వంసం చేసినట్లు అను మానాలు

Phone tapping: ప్రజా దీవెన హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజు కు కొత్త విషయాలు వెలుగు లోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. 2023 నవంబర్‌లో ట్యాప్ చేసిన సమా చారం తప్ప మిగిలిన డేటాను మొత్తం ధ్వంసం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో 2023 నవంబర్‌లో ట్యాపింగ్‌కు గురైన నెంబర్లు ఉన్న వారిని మాత్ర మే సిట్ అధికారులు విచారణకు పిలుస్తున్నారు. బాధితులుగా ఉన్న రాజకీయ నేతల వాంగ్మూలాలు నమోదు చేసి సాక్షిగా పెడుతున్నారు దర్యాప్తు అధికారులు. ఇదిలా ఉండగా.. తనను నియమించిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతోనే పని చేశానని ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభా కర్ రావు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐదో రోజు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు ప్రభా కర్ రావు. విచారణలో ప్రభాకర్ రావును ప్రశ్నిస్తూ ఆయన స్టేట్‌మెం ట్‌ను కూడా రికార్డు చేస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఐదు రోజులు.. గంటల పాటు విచారణ జరిపిన ప్పటికీ చాలా ప్రశ్నలకు తనకు తెలియదు, గుర్తు లేదనే సమాధా నం ఇచ్చినట్లు సమాచారం. సుప్రీం కోర్టులో రిలీఫ్ ఉండడం వల్లనే సిట్ విచారణకు ప్రభాకర్ రావు సహక రించడం లేదని పోలీసులు చెబుతు న్నారు. దీంతో సుప్రీంకోర్టులో ఉన్న రిలీఫ్‌పై ఆగస్టు 4న కౌంటర్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది.

పోలీస్ ఆఫీసర్ కావడంతో సిట్ అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు చాలా తెలివిగా సమాధానాలు చెపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న అధికారి, ప్రిన్సిపల్ సెక్రెటరీలను కూడా సిట్ విచారణ జరిపి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరూ తనకు తెలియదని.. అప్పటి డీజీపీ ఆదేశిస్తేనే ఫోన్‌ట్యాప్ చేసినట్లు చెబుతున్నారు ప్రభాకర్ రావు. ఈ క్రమంలో మాజీ డీజీపీని కూడా త్వరలో విచారించి.. స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేయడంలో ప్రభాకర్ రావు పాత్ర ఉన్నట్లు ఆధారాలు సేకరించింది సిట్.