–నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిలీజ్
Pinnelli Ramakrishna Reddy: ప్రజా దీవెన, నెల్లూరు: నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నె ల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) విడుదలయ్యా రు. వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు హైకోర్టు బెయిల్ (High Court Bail)మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల కాపీని శని వారం ఉదయం ఆయన న్యాయ వాదులు కేంద్ర కారాగారంలో అంద జేశారు. దీంతో అధికారులు ఆయ నను విడుదల చేశారు. జైలు నుం చి విడుదలైన పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డికి మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు స్వాగతం పలికారు. శనివారం ఉదయం జైలు వద్దకు పిన్నెల్లి అనుచరులు భారీ సంఖ్య లో చేరుకున్నారు.
వారిని పోలీసులు జైలు (Police is a prison)ప్రాంగణం నుంచి బయ టకు పంపారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి జైలు నుంచి బయటకు రాగానే ఆయనకు అనుకూలంగా నినాదా లు చేశారు.ఇక, పిన్నెల్లి విడుదల అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విలేకరులతో మాట్లా డుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై తప్పుడు కేసులు (cases)పెట్టారన్నారు. ఇలాంటి కేసులకు వైసీపీ నేతలు కార్యకర్తలు భయపడరని ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. దేశంలో చాలా చోట్ల ఈవీఎంలను పగలగొ ట్టినా కేవలం పిన్నిల్లి పైనే కేసు నమోదు చేశారన్నారు. హైకోర్టు ఉత్త ర్వుల (High Court orders)మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారు. ప్రజలకు సంబం ధించిన వ్యక్తిపై వివిధ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారన్నారు. చంద్ర బాబును విమర్శించిన వారిపై కేసు లు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. కేసులు పెట్టి భయ పెట్టాలని చూస్తే మేం భయపడేది లేదన్నారు. చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామా లు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిం చారు.