Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

PM Modi CM Revanth Reddy : నిధులు, నియామకాలు తెలంగాణ వాటా తేల్చండి

–ప్రధాని మోదీతో భేటీలో సీఎం రేవంత్, డిప్యూటీ భట్టి అప్పీల్
–రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల సవివరంగా ప్రస్తావన
–బొగ్గు బ్లాకులు సింగ‌రేణికే కేటాయించాలి
–తెలంగాణ‌కు 25 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయండి
–ర‌క్ష‌ణ శాఖ భూముల 2,450 ఎక‌రాలు కేటాయించండి
–విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశా ల‌ను నెర‌వేర్చాలి
–తెలంగాణకు ఐఐఎం పునరుద్ధరిం చాలని అభ్యర్థన
–విభజన హామీలు, క్షణ శాఖ భూ ముల బదిలీతో పాటు మొత్తం 12 అంశాలపై వినతి

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: సింగ‌రేణి ప‌రిధిలోని (Singareni range) బొగ్గు గ‌నుల‌ను సింగ‌రేణికే కేటాయించాల‌ని, ప్ర‌స్తుతం వేలంలో పెట్టిన శ్రావ‌ణప‌ల్లి బొగ్గు బ్లాక్‌ను (Coal block) వేలం జాబితా నుంచి తొల‌గించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy) విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌భుత్వ రంగంలో ఉన్న సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ (ఎస్‌సీసీఎల్‌)లో తెలంగాణ ప్ర‌భుత్వానికి 51 శాతం, కేంద్ర ప్ర‌భుత్వానికి 41 శాతం వాటాలు న్న‌ట్లు ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు.

గనులు, ఖ‌నిజాభివృద్ధి నియంత్ర‌ణ చ‌ట్టం లోని (ఎంఎండీఆర్‌) సెక్ష‌న్ 11ఏ/17 (ఏ) (2) ప్ర‌కారం వేలం జాబితా నుంచి శ్రావ‌ణ‌ప‌ల్లి గ‌నిని తొల‌గించాల‌ని, అదే సెక్ష‌న్ ప్ర‌కారం గోదా వ‌రి లోయ‌ బొగ్గు నిల్వ‌ల క్షేత్రం ప‌రిధి లోని కోయ‌గూడెం, స‌త్తుప‌ల్లి బ్లాక్ 3 గ‌నుల‌నూ సింగ‌రేణికే కేటాయించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

రాష్ట్రంలోని విద్యుదుత్ప‌త్తి కేంద్రాల అవ‌స‌ రాలు తీర్చేందుకు ఈ గ‌ నుల కేటాయింపు కీల‌కమైనందున, సింగ‌ రేణికే వాటిని కేటా యిం చాల‌ని ప్ర‌ధా న‌మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో ప్ర‌ధా న‌మంత్రి న‌రేంద్ర మోదీని ఆయ‌న నివాసంలో గురువారం మ‌ధ్యా హ్నం ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి క‌లిశారు. బొగ్గు గ‌నుల కేటాయిం పు, ఐటీఐఆర్ పున‌రుద్ధ‌ర‌ణ‌, ర‌క్ష‌ణ భూముల కేటాయింపు, రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలపై ప్ర‌ధాన‌మం త్రితో ముఖ్య‌మంత్రి చ‌ర్చించారు.

ప్ర‌ధాన‌మంత్రి (pm) నివాసానికి మ‌ధ్యా హ్నం 12.30 గంట‌ల‌కు చేరుకున్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy) సుమా రు గంట‌సేపు రాష్ట్రానికి సంబం ధించిన అంశాల‌పై ప్ర‌ధాన‌మంత్రితో చ‌ర్చించారు. ప్ర‌ధాన‌మంత్రితో ముఖ్య‌మంత్రి భేటీలో ఉప ముఖ్య‌ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క(Bhatti Vikramarka) పాల్గొన్నారు. 2010 సంవ‌త్సరంలో నాటి యూపీఏ ప్ర‌భుత్వం హైదరాబాద్, బెంగళూరు నగరాలకు స‌మాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్‌) మంజూరు చేసింద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

ఐటీ రంగంలో నూత‌న కంపెనీలు, డెవ‌ల‌ప‌ర్ల‌ను ప్రోత్స‌హిం చేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం 3 క్లస్టర్లలో అందుకు అవసరమై న భూమిని గుర్తించింద‌ న్నారు. 2014 త‌ర్వాత ఐటీఐఆర్ ముందుకు సాగ‌లేద‌ని, హైద‌రాబాద్‌ కు ఐటీఐఆర్ పున‌రుద్ధ‌రించాల‌ని పీఎంను సీఎం (cm)కోరారు.

కోచ్ ఫ్యాక్ట‌రీ… ఐఐఎం…. ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం (IIM) స్థాపిం చాల ని కేంద్ర ప్రభుత్వం (central govt) విధాన నిర్ణయం గా తీసుకున్నా ఇప్పటివరకు తెలం గాణకు ఐఐఎం మంజూరు కాలేద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ దృష్టికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీసుకె ళ్లారు. వెంట‌నే హైద‌రాబాద్‌లో ఐఐ ఎం మంజూరు చేయాలని, ఇందు కోసం హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీ క్యాంపస్‌లో సరిపడాభూమి అందుబాటులో ఉంద‌ని తెలిపారు.

సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో (Central University) కాకుండా మ‌రెక్క‌డైనా ఐఐఎం ఏర్పాటు చేస్తా మ‌న్నా ప్ర‌త్యామ్నాయంగా భూ కేటాయింపున‌కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో కాజీపేటలో కోచ్ ఫ్యా క్ట‌రీకి కేంద్ర ప్ర‌భుత్వం హామీ ఇచ్చిన విష‌యాన్ని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. కోచ్ తయారీ కేంద్రానికి బ‌దులు కాజీపేటలో పీరియాడికల్ ఓవరోలింగ్ వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు 20 23 జులైలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింద‌ని తెలిపారు.

దేశంలోని ఇతర ప్రాంతాలకు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసిన రైల్వే శాఖ కాజీపే టలో మాత్రం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్ర‌క‌టించ‌డం స‌రికాద‌న్నారు. కాజీ పేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూ రు చేయాలని ప్ర‌ధాన‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. ఇండి యా సెమీకం డక్టర్ మిషన్ లో తెలంగాణను చేర్చాల‌ని ప్ర‌ధాన‌మం త్రి మోదీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

హైదరాబాద్‌ లో సె మీకండక్టర్ ఫ్యాబ్స్‌ను (Semiconductor Fabs) నెల‌కొల్పేందు కు ప‌లు కంపె నీలు ఆస‌క్తి క‌న‌ప‌ర్చుతున్న‌ట్లు మోదీకి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ఆయా కంపెనీల ప్రతిపాదనలు ప్రస్తుతం ఇండియా సెమీకండక్టర్ మిషన్ సమీక్షలో ఉన్నందున‌, ఇండి యా సెమీకండక్టర్ మిషన్ లో తెలం గాణ రాష్ట్రానికి చోటు కల్పించాలని ప్ర‌ధాన‌మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.

తెలంగాణ‌కు ఇళ్లు కేటాయించండి.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ (PMAY) తొలి దశలో తెలంగా ణ రాష్ట్రానికి తక్కువ ఇళ్లు మంజూ ర‌య్యాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నాడు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పీఎంఏవై మార్గ దర్శకాలకు అనుగుణంగా లేకపోవ డంతో తక్కువ ఇళ్లు మంజూర‌ య్యాయ‌ని వివ‌రించారు.

2024- 25 నుంచి ప్రారంభమవుతున్న పీఎంఏవై పథకంలో 3 కోట్ల గృహా లను లక్ష్యంగా ఎంచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింద‌ని, అందులో తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మం జూరు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల విధివిధానాలను రూపొందిం చేందు కు సిద్దంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. సంసిద్ధంగా ఉంది. బీఆర్‌జీఎఫ్ నిధులు రూ.1800 కోట్లు ఇవ్వండి. వెనుకబడిన ప్రాం తాల అభివృద్ధి నిధి (BRGF) కింద కేంద్ర ప్రభు త్వం 2015 నుంచి 20 19 వరకు అయిదేళ్ల‌లో తెలంగా ణ‌కు రూ.2,250 కోట్లు కేటాయిం చింద‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

ఒక్కో ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున ఈ గ్రాంట్ మంజూరు చేశార‌ ని, 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవత్స రాలకు సంబంధించి బీఆర్‌జీఎఫ్ కింద తెలంగాణ‌కు రావ‌ల్సిన రూ. 1,800 కోట్లు విడుదల చేయాలని ప్ర‌ధాన‌మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

రక్షణ శాఖ భూముల బదిలీ చేయండి… రాజధాని హైదరా బాద్‌లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్-కరీంనగర్ రహదారి, హైదరాబాద్- నాగ్‌పూర్ ర‌హ‌దారి (ఎన్‌హెచ్‌-44)పై ఎలివే టెడ్ కారి డార్ల నిర్మించాల‌ని నిర్ణ‌ యించిన‌ట్లు ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన‌ మంత్రికి తెలియ‌జేశారు. ఆ రెండు కారిడార్ల నిర్మాణానికి అడ్డంకి లేకుం డా మార్గమధ్యంలో రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌దిలీ చేయాల‌ని కోరారు.

ఆ కారిడార్ల‌తో పాటు హైదరాబాద్ న‌గ‌రంలో రహదారుల విస్తరణ, రవాణా, ఇత‌ర‌ మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో 2450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాల ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ (RIC) కి లీజుకు ఇచ్చిన 2,462 ఎకరాల భూములను పూర్తిగా కేంద్రానికి అప్పగించేందుకు త‌మ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంద‌ని తెలిపారు.

బ‌య్యారంలో ఉక్కు క‌ర్మాగారం …రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకా రం తెలంగాణలో మౌలిక సదు పాయాల అభివృద్ధికి బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభు త్వం హామీ ఇచ్చింద‌ని ప్ర‌ధాన‌ మం త్రి మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ఉక్కు కర్మాగా రం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్ప టికే సాధ్యా సాధ్యాల నివేదికలు సమర్పించాయ‌ని, వెంట‌నే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పి ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్య‌మం త్రి కోరారు.

రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road)నిర్మాణం వేగవంతం చేయాలి.. భార త్‌మాల పరియోజన మొదటి దశ లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటు ప్పల్ వరకు) జాతీయ రహ దారి నిర్మాణానికి ఆమోదం తెలి పింద‌ని ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు. ఆ ర‌హ‌దారి నిర్మాణానికి సంబంధిం చిన భూ సేకరణ వ్యయంలో 50 శాతం ఖర్చును ఇవ్వ‌డంతో పాటు రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రికి ముఖ్య‌మంత్రి తెలియ‌జేశారు.

ఈ ర‌హ‌దారులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వీలైనంత తొంద రగా చేపట్టాలని కోరారు. హైదరాబాద్ చుట్టూ జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యంత ఉప‌యోగంగా ఉండే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగా న్ని (చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) వెంట‌నే జాతీయ రహదా రిగా గుర్తించి, వెంట‌నే భారత్ మాల పరియోజనలో దాని నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

జాతీయ ర‌హ‌దారులుగా…తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహ దారులను జాతీయ రహదారు లుగా అప్‌గ్రేడ్ చేయాల‌ని ప్ర‌ధాన‌ మంత్రి న‌రేంద్ర మోదీకి (pm modi) ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

జగిత్యాల-పెద్దపల్లి-కాటారం, దిండి-దేవరకొండ-మల్లెపల్లి-నల్గొండ, భువనగిరి- చిట్యాల, చౌటు ప్పల్ అమన్‌గల్-షాద్ న‌గ‌ర్‌- సంగారెడ్డి, మరికల్- నారాయణపే ట రామసముద్ర, వనపర్తి- కొత్తకో ట-గద్వాల మంత్రాలయం, మన్నె గూడ-వికారాబాద్-తాండూరు-జహీరాబాద్-బీదర్, కరీంనగర్- సిరిసి ల్ల- కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు- గద్వాల- రాయచూరు, కొత్తపల్లి- హుస్నా బాద్- జనగాం – హైదరాబాద్, సారపాక- ఏటూరునాగారం, దుద్దె డ- కొమురవెల్లి-యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్డు, జగ్గయ్యపేట- వైరా-కొత్తగూడెం రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని ప్ర‌ధా న‌మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.

PM Modi CM Revanth Reddy