–జాతికి పిలుపునిచ్చిన ప్రధాని మోదీ
PM MODI: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 15 భారత స్వా తంత్య్ర దినోత్సవ (India’s Independence Day) వేడుకలకు సన్నద్ధమవుతోంది. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో (Independence Day celebrations) భాగంగా సంబరాలు జరుపుకునేందుకు యావత్ భారతావని సమస్తం సిద్ధ మవుతోంది. ఈ నేపథ్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట ప్రచార కార్యక్ర మాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోం ది. ఈ కార్యక్రమాన్ని జాతీయ పం డగగా నిర్వహించాలని జులైలో మ న్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం లో ప్రతీ ఒక్కరు పాల్గొని జాతీయ పతాకంతో సెల్ఫీ దిగి ఆ చిత్రాన్ని హర్‌తిరంగా.కామ్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయాలని సూచించారు.
హర్‌ఘర్ తిరంగాను (Harghar Thiranganu)గుర్తుండిపోయే ఈవెంట్ గా మార్చుకుందామని దేశ ప్రజల కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా పిలుపునిచ్చారు. ఇందు లో భాగంగా అందరూ త్రివర్ణ పతా కాన్ని తమ సోషల్ మీడియా ఖాతా ల్లో ప్రొఫైల్ పిక్‌గా (Profile pic) పెట్టుకోవాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా మోదీ ట్వీట్ పెట్టా రు.ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్స వం సమీపిస్తున్న తరుణంలో హర్ ఘర్‌తిరంగాని మరపురాని ప్రజా ఉద్యమంగా మారుద్దాం. నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకున్నాను. మీరు కూడా అలాగే చేసి ఈ ఉద్యమంలో నాతో చేరాలని మీ అందరినీ కోరుతున్నా ను. జాతీయ జెండాలతో ఉన్న మీ సెల్ఫీలను హర్‌ఘర్‌తిరంగా.కామ్ (https://hargartiranga.com) లో షేర్ చేయండి’ అంటూ మోదీ పిలుపునిచ్చారు.