Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

PM Modi: గవర్నర్లు సమర్థవంతమైన వారధులు

–గిరిజనుల సంక్షేమానికి విశేషంగా కృషి చేయాలి
–ఢిల్లీలో గవర్నర్ ల సదస్సులో ప్రధాని మోదీ

PM Modi: ప్రజా, న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల (Central and State Govt)మధ్య సమర్థవంతమైన వా రధి నిర్మించేందుకు గవర్నర్లు కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం రాష్ట్రపతి భవ న్‌లో గవర్నర్ల సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు. అణగారిన వర్గాలకు న్యాయం లభించే విధంగా ప్రజలు, సామాజిక సంస్థలతో సంప్ర దింపులు జరపాలని సూచించారు. గవర్నర్‌ పదవి రాజ్యాంగ పరిధిలో నే ప్రజలకు సేవ చేసేందుకు ఏర్పర్చి న ముఖ్యమైన వ్యవస్థ అని ఆయ న అన్నారు. ముఖ్యంగా ఆదివాసీ ప్రజల ప్రయోజనాలకు గవర్నర్లు తోడ్పడాలని చెప్పారు. గవర్నర్ల సదస్సును ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) జాతీయ లక్ష్యాలు సాధించేందుకు తోడ్పడాలని గవ ర్నర్లకు పిలుపునిచ్చారు.

కేంద్ర రాష్ట్ర (central state)సంబంధాలను బలోపేతం చేసేందుకే కాక, సామాన్యులకు సంక్షేమ కార్యక్రమాలు చేరేందుకూ కృషి చేయాలన్నారు. క్రిమినల్‌ న్యాయవ్యవస్థకు సంబంధించిన కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఆమె చెప్పారు. ప్రజాస్వామ్యం సా ఫీగా పనిచేయాలంటే కేంద్ర ఏజె న్సీలు అన్ని రాష్ట్రాల్లో సమన్వ యంతో పనిచేయాలని, ఇందుకు ఏ విధంగా కృషి చేయాలో రాజ్యాంగా ధినేతలుగా గవర్నర్లు సూచించా లని ఆమె కోరారు. రాష్ట్రాల్లో చాన్స లర్లుగా కూడా గవర్నర్లు బాధ్యతలు నిర్వర్తిస్తున్నందువల్ల నూతన విద్యా విధానం సూచించిన సంస్కరణలు అమలు అయ్యేలా చూడాలని సూ చించారు. సహజ వ్యవసాయ విధా నాలను పెంపొందించేందుకు రాజ్‌ భవన్లు మార్గదర్శకం కావాలని చెప్పారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధంఖడ్‌, హోంమంత్రి అమిత్‌షా (Vice President Jagdeep Dhankhad, Home Minister Amit Shah)కూడా రెండు రోజుల సదస్సులో తొలిరోజు ప్రసంగించారు. అభివృద్ది పనులకు ఊతం ఇచ్చేందుకు ఆశా వహ జిల్లాలు, చైతన్యవంత మైన గ్రామాలను సందర్శించాలని అమి త్‌ షా గవర్నర్లను కోరారు.