— అతి త్వరలోనే పంటల భీమా
— ఈ నెలాఖరు వరకు క్లస్టర్ల వారీ గా టెండర్లు
— ప్రీమియం చెల్లింపునకు రూ.2,5 00కోట్ల అంచనా
PMFBY: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో త్వరలో పంటల బీమా అం దుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం పంటల బీమాపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ (Central Govt) పరి ధిలోని ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ (పీఎంఎఫ్‌బీవై) (PMFBY)పథకం కింద బీమాను రాష్ట్రంలో అందు బాటులోకి తీసుకు రానుంది. ఇం దుకు సంబంధించిన కసరత్తును వ్యవసాయ శాఖ ఇప్పటికే పూర్తి చేయగా త్వరలోనే దీని అమలుకు మార్గం సుగుమం కానుంది. ఇందు లో భాగంగానే ఈ నెలాఖరు వరకు టెండర్లను ఆహ్వానించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయి తే పంటల బీమా కోసం పిలిచే టెం డర్లను గంపగుత్తగా కాకుండా క్లస్టర్ల వారీగా పిలవాలని వ్యవసాయ శాఖ నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాకుండా దాదాపు అన్ని పంటలకు బీమాను వర్తింపజే యాలని ప్రభుత్వం నిర్ణయం తీసు కున్నట్టు సమాచారం పీఎంఎఫ్‌బీ వైలోని మార్గదర్శకాలను అను సరించి పంటలకు బీమాను అందు బాటులోకి తీసుకురానున్న నేప థ్యంలో ప్రీమియం చెల్లింపునకు సుమారు రూ.2,500 కోట్ల నిధులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ ప్రాధమికంగా అంచనా వేస్తోం ది. టెండర్ల ప్రక్రియ పూర్తయితే నిధుల అంశంపై స్పష్టత రానుంది. అయితే పంటల బీమాకు చెల్లిం చాల్సిన రాష్ట్ర వాటా, రైతుల వాటాను కలిపి ప్రభుత్వమే చెల్లిం చనుంది.
రైతులు (farmers), రాష్ట్రం వాటా ను చెల్లించిన తర్వాత కేంద్రం తన వాటాను జమ చేస్తుంది. పంటల గుర్తింపు, దిగుబడి లెక్కింపునకు సాంకేతికతను వినియోగించ నుం డగా ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసు కురానున్నట్టు తెలిసింది. అదే సమ యంలో సాంకేతికతతో పాటు ఆఫ్ లైన్ (మాన్యువల్) విధానంలోనూ పంటలను గుర్తించనున్నారు. ఇది లా ఉండగా రాష్ట్రంలో ఇటీవల కురిసిన వానలు, వచ్చిన వరదల నేపథ్యంలో వానాకాలంలో సాగైన పంటల్లో సుమారు 4.15లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు ప్రభు త్వం గుర్తించిన విషయం తెలి సిందే. ఈ మేరకు గుర్తించిన పంట నష్టాలకు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందించనుం ది. ఈ నేపథ్యంలో పంటల బీమా (Crop Insurance) ను వానాకాలం సీజన్ నుంచి అమ లు చేస్తారా లేక యాసంగి నుంచి అమలుచేస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే వానాకాలం సీజన్ ముగిసిందని, ఈ లోపే బీమా పథకం అందు బాటులోకి వచ్చి ఉంటే రైతులకు లబ్ధి చేకూరేదని రైతు సంఘాలు అంటున్నాయి. కాగా ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 1.23కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవ్వగా.. వీటిలో వరి 59.76 లక్షల ఎకరాలు, పత్తి 43.29 లక్షల ఎకరాలు, కంది 4.83లక్షలు, మొక్కజొన్న 5.30లక్షల ఎకరాల్లో సాగయ్యాయని ఇటీవల వ్యవసా య శాఖ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పంట బీమా అమలు, వ్యవసాయ శాఖ భవి ష్యత్తు కార్యాచరణపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు (Tummala Nageshwar Rao) శనివారం సచివాల యంలో శాఖ అధికారులతో సమీక్షించారు. పంటల బీమా అమలు, అందుకు తీసుకోవాల్సిన చర్యలు, రైతులకు ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలు రూపొందించే అంశంపై చర్చించారని మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.