Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

POCSO Act : పోక్సో కేసు లో దేశంలోనే మొదటి మరణశిక్ష….!

POCSO Act: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: 21 మంది మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో (POCSO Act)నేరం రుజువు కావడంతో నిందితుడికి గౌహాతి కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే దేశంలోనే పోక్సో చట్టం క్రింద మరణ శిక్ష విధించిన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.పూర్తీ వివరాల్లోకి వెళితే యుమ్కెన్ బాగ్రా (Yumken Bagra) అనే వ్యక్తి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రెసిడెన్షియల్ స్కూల్‌లో వార్డెన్ గా పని చేసేవాడు. దీంతో పిల్లల బాబుగోగులు చూసుకోవాల్సిన యుమ్కెన్ బాగ్రా అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారానికి పాల్పడుతూ చివరికి ఈ విషయాల గురించి ఎవరికైనా చెబితే హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడేవాడు. అయితే ఇదేవిధంగా 2022వ సంవత్సరంలో ఇద్దరి కవలపిల్లలపై అత్యాచారానికి పాల్పడగా బాధితురాళ్లు తమ తల్లిదండ్రులకు చెప్పారు.

దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా యుమ్కెన్ బాగ్రా పై పోక్సో చట్టంపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈక్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో కమిటీ వేసి మరింత లోతుగా విచారణ చేశారు. ఈ విచారణలో యుమ్కెన్ బాగ్రా 2014 నుంచి ఇప్పటివరకూ దాదాపుగా 21 మందిపై చిన్నారులపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు కనుగొన్నారు.

అలాగే ఆధారాలతో కోర్టులో యుమ్కెన్ బాగ్రా (Yumken Bagra) ని హాజరుపర్చారు. ఆధారాలు పరిశీలించిన కోర్టు యుమ్కెన్ బాగ్రా కి మరణ శిక్ష విధించింది. అలాగే యుమ్కెన్ బాగ్రా కి (Yumken Bagra) సహకరించిన మరో ప్రధానోపాధ్యాయుడికి, స్టాఫ్ సిబ్బందిలోని (Staff staff) ఒకరికి 20 ఏళ్ళ పాటూ జాలు శిక్ష విధించింది. కాగా యుమ్కెన్ బాగ్రా కేసులో భాదితుల తరుపున వాదించిన ప్రముఖ న్యాయవాది బింగెప్ మాట్లాడుతూ పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి నేరం నిరూపణ అవడంతో మరణ శిక్ష (death sentence)విధించిన మోట మొదటి కేసు ఇదేనని తెలిపారు.