Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Munaasu Venkat : ప్రకృతితో మమేకమై జీవనతాత్వి కతను ఆవిష్కరించగల కవి మునా సు వెంకట్

–ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

Munaasu Venkat : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రకృతితో మమేకమై జీవనతాత్వికతను తన కవిత్వంలో నేర్పుగా ఆవిష్కరించగ ల కవి మునాసు వెంకట్ అని ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కితా బునిచ్చారు. సృజన సాహితీ ఆ ధ్వ ర్యంలో ఆదివారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్థానిక క్యాంప్ కార్యాలయంలో నల్లగొండ కు చెందిన ప్రముఖ కవి మునాసు వెంకట్ రచించిన దాపు కవితా సం పుటిని విజయ డెయిరీ చైర్మన్ గు త్తా అమిత్ రెడ్డి తో కలిసి ఆవిష్క రించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అస్తిత్వ ఉద్యమాలలో దళిత బహుజన కవిత్వాన్ని సుసంపన్నం చేసిన కవుల్లో మునాసు వెంకట్ ముందు వరుసలో ఉంటాన్నారని అభిప్రాయపడ్డారు. డాక్టర్ బెల్లి యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ విమర్శకు లు అంబటి సురేంద్రరాజు మాట్లా డుతూ అట్టడుగు వర్గ జీవితాలతో అంతర్జాతీయ స్థాయి కవిత్వం రా సిన వారు మునాసు వెంకట్ అని కొనియాడారు.

మరొక విమర్శకులు గుంటూరు ల క్ష్మీ నరసయ్య మాట్లాడుతూ నవ్య మైన అభివ్యక్తితో తనదైనశైలిలో క విత్వం రాసిన మునాసు వెంకట్ క విత్వం తెలుగు సాహిత్యం ఉన్నం తకాలం అజరామరమన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కవిగాయక సిద్ధార్థ, బైరెడ్డి కృష్ణారెడ్డి, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, భానుశ్రీ కొత్వాల్, పెరు మాళ్ళ ఆనంద్, అంబటి వెంకన్న, తుల శ్రీనివాస్, మేరెడ్డి యాదగిరి రెడ్డి, శీలం భద్రయ్య, బోధనం నర్సి రెడ్డి, పగడాల నాగేందర్, భూతం ముత్యాలు, సాగర్ల సత్తయ్య, కస్తూ రి ప్రభాకర్,మాదగాని శంకరయ్య, బండారు శంకర్ తదితరులు పాల్గొ న్నారు.