–నేటితో నాలుగు రోజుల పర్యట ముగించుకున్న విదేశీ నిపుణుల బృందం
–నాలుగు రోజుల పాటు క్షేత్రస్థాయి లో వివరాల సేకరణ
–చివరి రోజు స్థానిక రైతులతో భేటీ అయిన నిపుణుల కమిటీ
Polavaram Project: ప్రజాదీవెన, పోలవరం: ఆంధ్ర ప్రదేశ్ ఆశాదీపం పోలవరంలో (polavaram)విదేశీ నిపు ణుల బృందం పర్యటన ముగిసిం ది. పర్యటన లో భాగంగా చివరి రోజు స్థానిక రైతులు (farmers)నిపుణుల కమిటీని కలిసి పోలవరం ఆవ శ్యకతను వివరించారు. పోలవరం ప్రాజెక్టులో సమస్యలపై అధ్యయ నం చేసేందుకు ముందుకు వచ్చిన బృందాన్ని రైతులు అభినందిం చారు. పోలవరం ప్రాజెక్టును 4 రోజుల పాటును విదేశీ నిపుణుల (Foreign experts) బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. తొలి రోజు అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం, స్పిల్ వేలను నిపుణులు పరిశీలించారు. రెండో రోజు డయాఫ్రం వాల్, ఈసీఆర్ యఫ్ డ్యాం (dam) నిర్మాణ ప్రాంతాలను నిపుణుల బృందం పరిశీలించింది. డయాఫ్రం వాల్‌పై అనుమానం వచ్చిన ప్రతి చోటా కాంక్రీట్, మట్టి నమూనాలు సేకరించారు. ఇంజనీరింగ్ పరికరాల ద్వారా డయాఫ్రం వాల్‌ను లోతుగా చెక్ చేసి వాస్తవ పరిస్థితిపై రిపోర్ట్ రెడీ చేయనున్నారు. అలాగే కేంద్ర జలవనరుల శాఖ అధికారుల అనుమానాలు, ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చారు. కాంక్రీట్, మట్టి నమూనాలు సేకరించిన నిపుణులు.. కేంద్ర, రాష్ట్ర అధికారులకు నిపుణుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
బంకమట్టిపై ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టాల్సి వస్తే పటిష్టంగా ఉంటుందా లేదా అనే విషయంపైనా క్లారిటీ (clarity)ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలకు కూడా ఎటువంటి ఢోకా ఉండదని తెలిపారు. నాలుగు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టును అధ్యయనం చేసిన బృందం కూడా టెక్నికల్ టీమ్ పోలవరాన్ని త్వరలోనే పీపీఏకు రిపోర్ట్ ఇవ్వబోతోంది.
పోలవరం డ్యామ్ (polavaram dam)సైట్ ను పరిశీలిం చిన అంతర్జాతీయ నిపుణుల్లో అమెరికా నుంచి జియాన్ ఫ్రాంకో డి సిక్కో, డేవిడ్ బి. పాల్ ఉండగా కెనడా నుంచి సీన్ హించ్‌బర్గర్, రిచర్డ్ డోన్నెల్లీ ఉన్నారు. ఈ నలు గురూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మా ణానికి (construction)సంబంధించిన అంశాల్లో ఎక్స్‌పర్ట్స్ వీరంతా ప్రాజెక్ట్ లపై గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్న అనంతరం రిపోర్ట్ ఇస్తారు.