Police Officer Farewell : ప్రజా దీవెన, ఉత్తర్ ప్రదేశ్: ఉత్తమ సేవలకు గుర్తింపుగా అందివచ్చే అ భిమానాలు, సన్మానాలు ఒక వి ధంగా ఆకాశాన్నoటడం పరిపాటే. అయితే అంతటా ఒకవిధంగా ఇ క్కడో మరో విధంగా జరుగడం ఆశ్చర్యం కలిగించే అంశమే అని తెలుస్తుంది.
సాధారణంగా ఓ ఉద్యోగి ఒకచోటు నుంచి మరొకచోటుకు బదిలీపై వె ళ్తుంటే ఏంచేస్తారు, తోటి ఉద్యోగు లు చిన్న ఫేర్‌వెల్ పార్టీ అరేంజ్ చే స్తారు. బదిలీపై వెళ్తున్న అధికారిని ఘనంగా సత్కరిస్తారు. తోచిన బ హుమతులు ఇచ్చి అతనితో తమ కున్న అనుబంధాన్ని గుర్తు చేసు కుంటారు. అయితే, ఓ పోలీసు ఆఫీసర్ బదిలీపై వెళ్తుంటే స్థానికు లు మేళతాళాలతో ఘనంగా వీడ్కో లు పలికిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
దేవరియా జిల్లాలో మదన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ వినోద్ కు మార్ సింగ్ ఆరు నెలల పదవీకా లం ముగిసిన తర్వాత అతన్ని అ ధికారులు వేరే చోటుకి బదిలీ చే శారు. అయితే, అతని పనితీరుతో స్థానికులకు బాగా దగ్గరయ్యారు వి నోద్ కుమార్ సింగ్.
దీంతో అతడు ట్రాన్స్‌ఫర్‌పై వెళ్తుం టే స్థానిక ప్రజలు తట్టుకోలేక భావో ద్వేగానికి గురయ్యారు. అంతేకా దు ఆ పోలీస్ ఆఫీసర్‌కు ఘనంగా వీ డ్కోలు పలికారు. వినోద్ కుమా ర్‌ను పూలతో సత్కరించారు. గుర్రా లు, డ్రమ్స్, మేళతాళాల మధ్య అ తడిని రోడ్లపై ఊరేగింపుగా తీసుకె ళ్లారు. ఇందుకు సంబంధించిన వీ డియో ప్రస్తుతం నెట్టింట విస్తృతం గా వైరల్ అవుతోంది.
Policeofficer farewell party in uttar pradesh pic.twitter.com/ZVdjXzKfjI
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) April 18, 2025