Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pooja Khedkar: పత్తాలేని వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌

–సెల్‌ఫోన్‌నూ స్విచ్‌ ఆఫ్‌ చేసిన పూజా ఖేద్కర్‌

Pooja Khedkar: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో ఐఏఎస్ లకే మచ్చతెచ్చిన వివాదా స్పద ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ (Pooja Khedkar) పత్తాలేకుండా పోయారు. ముస్సోరి లోని లాల్‌బహదూర్‌ శాస్త్రి (Lal Bahadur Shastri) నేషనల్‌ అకాడమీ(ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ)లో మంగళవారంలోగా ఆమె రిపోర్టు చేయాలని గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే గడువు ముగిసినా ఆమె ఎల్‌బీ ఎస్‌ఎన్‌ఏఏకు రాలేదు. ఆమె సెల్‌ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ కావడం తో ఆమెపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు. ఇప్పటికే సివిల్‌ సర్వీస్‌ పరీక్షల దరఖాస్తులో తప్పుడు వివ రాలతో మోసగించారంటూ యూపీఎస్‌సీ ఆమెపై క్రిమినల్‌ కేసు నమోదు చేసింది. తన తల్లిదండ్రు లు విడిపోయారంటూ తప్పుడు వివరాలతో నాన్‌ క్రీమీలేయర్‌ ఓబీసీ సర్టిఫికెట్‌ను పూజ పొందినట్టు నిర్ధా రణ కావడంతో ఆమె తల్లిదండ్రుల వైవాహిక సంబంధంపై నివేదిక సమ ర్పించాలని తాజాగా పుణె పోలీసు లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. లెక్కల్లో చూపని ఆస్తులకూ ప్రభు త్వ చిహ్నాలను వాడుకోవడం ద్వా రా నిబంధనలు ఉల్లంఘించిన కేసు లు కూడా పూజ, ఆమె తల్లిదండ్రు లపై నమోదయ్యాయి.

వ్యవసాయ నుంచి ఆటోమొబైల్స్‌ (From agriculture to automobiles) వరకు ఎనిమి ది కంపెనీలను పూజ కుటుంబం తమ బంధువులు, స్నేహితుల పేర్లతో నిర్వహిస్తున్నట్టు తాజాగా ఓ ఆంగ్ల పత్రిక పరిశోధనలో వెల్లడైంది. ఆయా వ్యక్తులను పత్రిక సంప్రదిం చగా ప్రస్తుతం ఆ సంస్థలతో తమ కేమీ సంబంధం లేదని వెల్లడిం చారు. కాగా పూజా ఖేద్కర్‌కు (Pooja Khedkar)దివ్యాంగ సర్టిఫికెట్‌ జారీ చేసిన పుణెలోని యశ్వంత్‌రావు చవాన్‌ మెమోరియల్‌ ఆస్పత్రి ఇందులో తామేమీ తప్పు చేయలేదని ప్రక టించింది. చట్టంలోని నిబంధనల ప్రకారమే ఆమెకు 7% లోకోమోటర్‌ వైకల్యం ఉన్నట్టు సర్టిఫికెట్‌ జారీ చేశామని, ఆ సర్టిఫికెట్‌ విద్య, ఉపా ధి అవకాశాలకు ఏ మాత్రం ఉప యోగపడదని ఆస్పత్రి డీన్‌ డాక్టర్‌ రాజేంద్ర వాబ్లే చెప్పారు. కలెక్టర్‌ (collector) ఆదేశం మేరకు ఆస్పత్రిలో అంతర్గ త దర్యాప్తు జరిపించామని, వైద్యు ల, సిబ్బంది తప్పు ఏమీ లేదని తేలిందని తేల్చేశారు.