ఏపీలో సంచలన పరిణామం
Prabhakar Reddy:ప్రజాదీవెన, అమరావతి: ఏపీ రాజకీయాల్లో సోమవారం సంచలన పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (Prabhakar Reddy).. వైఎస్ విజయమ్మతో (YS Vijayamma) భేటీ అయ్యారు. హైదరాబాద్లోని (Hyderabad) విజయమ్మ నివాసానికి వెళ్లిన ఆయన విజయమ్మతో సమావేశమయ్యారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని (health condition) అడిగి తెలుసుకున్నారు. అరగంట పాటు వీరి సమావేశం జరగ్గా.. ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు లేవని.. మామూలుగానే కలిశారనే జేసీ సన్నిహిత వర్గాలు (jc closest friends) తెలిపాయి.