Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వ్యవహారంలో మరో ముందడుగు

Prakasam Barrage: ప్రజా దీవెన, అమరావతి: ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage: ) వద్ద గేట్లను ఢీకొట్టిన బోట్ల వ్యవహారంలో కీలక ముందడుగు పడింది. గేట్లను ఢీకొట్టిన బోట్ల (boat)య జమానులను పోలీసులు గుర్తించి నట్లు సమాచారం. గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెం కు చెందిన రామ్మోహన్ అనే వ్యక్తు లకు చెందిన బోట్లుగా గుర్తించిన ట్లు సమాచారం. బోట్లు ఢీ కొట్టిన ఘటన వెనుక కుట్ర కోణం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేప థ్యంలో పోలీసులు కేసు (Police case) నమోదు చేశారు. ఇటీవల కురిసిన భారీ వ ర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తింది. ఈ సమయం లోనే వరద నీటితో పాటుగా బోట్లు కొట్టుకువచ్చాయి. ఈ బోట్లు గేట్ల ను తాకడంతో ప్రకాశం బ్యారేజీ 67,69 గేట్లు కాస్త దెబ్బతిన్నాయి. ఒక బోటు కౌంటర్ వెయిట్‌ను ఢీకొ ట్టడంతో అది కాస్తా విరిగిపోయిం ది. అలాగే 67, 68, 69 గేట్లకు రెం డు బోట్లు అడ్డుపడ్డాయి. దీంతో ఆయా గేట్ల నుంచి వరద నీటి (flood water) ప్ర వాహం నిలిచిపోయింది. మిగిలిన గేట్ల ద్వారానే అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. అయి తే దెబ్బతిన్న గేట్ల వద్ద అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టారు.

నిపుణుడు కన్నయ్య నాయుడు నేతృత్వంలో అధికారులు 67, 69 వ గేట్ల (gates)వద్ద దెబ్బతిన్న కౌంటర్‌ వెయిట్‌లను అమర్చారు. రెండు రోజులపాటు ఇంజనీర్లు తీవ్రంగా శ్రమించి గేట్ల మరమ్మత్తు పనులు పూర్తిచేశారు. నదిలో నీరు ప్రవహి స్తున్నా, భారీ వర్షం కురుస్తున్నా కూడా లెక్కచేయక మరమ్మత్తు పనులను పూర్తిచేశారు. మరోవైపు వరద ప్రవాహంలో బోట్లు కొట్టుకు వచ్చి గేట్లను ఢీకొట్టడంపై అను మానాలు వ్యక్తమయ్యాయి. ఒకే సారి నాలుగు పడవలు బ్యారేజీ గేట్లను తాకడం వెనుక కుట్ర ఉం దనే ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనను ప్రభు త్వం చాలా సీరియస్‌గా తీసు కుంది. ఈ నేపథ్యంలోనే నీటిపా రుదలశాఖ అధికారులు పోలీసు లకు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ ఈఈ కృష్ణారావు (Irrigation EE Krishna Rao) విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ర్యాష్ అండ్ నెగ్లిజన్స్ యాక్ట్, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ (Property Damage Act) సెక్షన్ల కింద విజయవాడ వన్ టౌన్ పోలీసులు కేసు (police case) నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన బోట్ల యజమానులను గుర్తించినట్లు తెలిసింది. బోట్లు గొల్లపూడి, సూరాయపాలెనికి చెందినవారివిగా గుర్తించారు. ఇక ప్రమాదవశాత్తూ ఇవి కొట్టుకువచ్చాయా లేదీ వీటి వెనుక కుట్ర కోణం దాగి ఉందా అనే విషయమై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.