Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

President Droupadi Murmu: పవిత్రమైన ‘ప్రజాస్వామ్యo’ పై పగ

–దేశానికి వెన్నెముకైన ప్రజాస్వా మ్యాన్ని అస్థిరపర్చే కుట్రలు
–జూలై 1 నుంచి కొత్త నేర చట్టాల అమలు
–రహదారులు,విమానయానంలో సమూల మార్పులు
–త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌
–ఉభయ సభల సమావేశంలో రాష్ట్రపతి ముర్ము

President Droupadi Murmu: న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) (CAA) కింద శరణార్థులకు ప్రభుత్వం పౌరసత్వం (Government is citizenship) కల్పించడం జరిగింది, జూలై 1 నుంచి కొత్త నేర చట్టాలు (New Criminal Laws) అమల్లోకి రానున్నాయి, ఎమ ర్జెన్సీ దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది,ఆ రోజుల్లో ప్రజలు ఎన్నో బాధలు అ నుభవించారని భారత రాష్ట్రపతి ద్రౌపది మూర్ము ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అలాంటి రాజ్యాంగ విరుద్ధ (Unconstitutional) శక్తులపై వ్యతిరేకంగా దేశం విజయం సాధించిందని,ప్రపంచ వృద్ధిలో భారత్‌ భాగస్వామ్యం 15 శాతం కాగా గ్రీన్‌ ఎనర్జీ (Green energy) సాధన దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా రోడ్ల విస్తరణ జరుగుతోందని పేర్కొన్నా రు.

పౌర విమానయాన రంగంలో మార్పులు తీసుకొచ్చామని తద్వా రా డిజిటల్‌ ఇండియా సాధనకు ప్రభుత్వం సంకల్పించిందని వివరిం చారు. బ్యాంకుల క్రెడిట్‌ బేస్‌ (Credit base of banks) పెంచి వాటిని బలోపేతం చేశామని, డిజి టల్‌ లావాదేవీలు భారీగా పెరిగా యని, సైనిక దళాల్లో స్థిరమైన సం స్కరణలు రావాలని, మన బల గా లు స్వయంసమృద్ధి సాధించా యని, రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేశామని, సైనికులకు ఒకే ర్యాంకు, ఒకే పింఛన్‌ అమలు చేయగా రక్షణ ఉత్పత్తుల ఎగుమ తులు పెరిగాయని రాష్ట్రపతి ఉపన్యాసంలో పేర్కొన్నారు. గురువారం రాష్ట్రపతి భవన్‌ (Rashtrapati Bhavan)నుంచి పార్లమెంట్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము (President Murmu) రాజదండం మర్యాదతో లోపలికి అడుగుపెట్టారు.

గజ ద్వారం వద్ద ప్రధాని మోదీ (modi), లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా (om birla), రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు సాదర స్వాగతం పలికారు. కాగా, ‘ఆప్‌’ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యం లో రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉండాలని ‘ఆప్‌’ నిర్ణయించింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మురుము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజాస్వామ్యమే దేశా నికి వెన్నెముక అని, ఇలాంటి పవి త్రమైన ప్రజాస్వామ్యాన్ని అస్థిర పర్చే కుట్ర జరుగుతోందని రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu is the president of the state)ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు మనమంతా ఐక్యంగా ఉందామని పిలుపుని చ్చారు. మూడోసారి అధికారం చేప ట్టిన మోదీ ప్రభుత్వ ప్రాధా మ్యాలను వివరించారు. ‘ప్రపంచం లోనే అతిపెద్ద ఎన్నికలు సజావుగా సాగాయి. ఈ ప్రక్రియను విజయ వంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘానికి అభినందనలు. ఈ ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు. నిజాయితీని నమ్మి ప్రభు త్వానికి మూడోసారి అవకాశం కల్పించారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి మీరంతా లోక్‌సభకు వచ్చా రు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతీ సభ్యుడు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా. జమ్ముకశ్మీర్‌పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తుండగా ఈసారి కశ్మీర్‌ లోయలో మార్పు కనిపించిం దని, శత్రువుల కుట్రలకు అక్కడి ప్రజలు గట్టిగా బదులిచ్చి పెద్దఎ త్తున ఓటింగ్‌లో పాల్గొనడం విశే షం. అక్కడ సంస్కరణలు, పని తీరు, మార్పు ఆధారంగా ప్రజలు నిన్నటి ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు.

‘నీట్‌’, ‘నెట్‌’ పేపర్‌ లీకేజీ (neet) ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది. నిష్పక్షపా తంగా విచారణ జరుగుతోంది. నిం దితులపై చర్యలు తప్పవు. లీకేజీపై సీబీఐ (cbi) దర్యాప్తునకు ఆదేశించడం ప్రభుత్వ జవాబుదారీతనాన్ని తెలి యజేస్తోంది. ప్రభుత్వం చేపట్టే నియా మకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాలి. పారదర్శకంగా జరగాలి. ఇలాంటి ఘటనల్లో రాజకీయా లకతీతంగా వ్యవహరించాలి. దేశా న్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వం పదేళ్లలో సుస్థిర అభివృ ద్ధిని సాధించింది. రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోంది.. చిన్న, సన్నకారు రైతుల కోసం పీఎం సమ్మాన్‌ నిధి కింద ఇప్పటివరకు రూ.3.20 లక్షల కోట్లు ఇచ్చింది. ఆర్థిక భరోసా కోసం నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదును జమ చేస్తోంది.. ఆర్గానిక్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది. పంటలకు మద్దతు ధర విషయంలో కట్టుబడి ఉన్నాం.ఆరోగ్యలో దేశం అగ్రగామి గా ఉంది. ఆయుష్మాన్‌ భారత్‌ అనేది గేమ్‌ ఛేంజర్‌(కీలకం)గా నిలుస్తోంది. దీంతో ప్రజలకు మెరుగైన వేద్య సేవలందిస్తున్నాం.. 70 ఏళ్లు దాటిన వారందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ కింద సేవలు కల్పిస్తున్నాం. ప్రజా సంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాం. మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. వారి అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. పెద్దఎత్తున మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.