Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

President Tumati Varaprasad Reddy : కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

*సీఎం సభకు వేలాదిగా తరలి విజయవంతం చేయాలి : వరప్రసాద్ రెడ్డి

President Tumati Varaprasad Reddy : ప్రజా దీవేన, కోదాడ: మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి నివాస గృహములో కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి వరప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆదివారం హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి సభ కు కోదాడ మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుండి ఒకటి రెండు బస్సులలో కార్యకర్తలను తరలించి సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల హుజూర్నగర్ సభకు బయలుదేరి ముఖ్యమంత్రి సందేశం వినాలని తెలిపారు హుజూర్నగర్ లో జరిగే సీఎం సభకు కోదాడ మండలం నుండి.

ప్రతి గ్రామము నుండి నాలుగు గంటలకల్లా బయలుదేరి సభకు చేరుకోవాలని లేనిపక్షంలో ట్రాఫిక్ ఇబ్బందులు వలన సభకు హాజరు కాకుండా వెనుతిరగవలసి వస్తుందని అందుకు ప్రతి ఒక్కరు నాలుగు గంటలకల్లా కోదాడ నుండి బయలుదేరాలని తెలిపారు అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ నాడు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం మన నియోజకవర్గానికి గర్వకారణం అని తెలిపారు ఈ కార్యక్రమంలో తుమాటి వరప్రసాద్ రెడ్డి, ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, నంబూరి సూర్యం, వెంకటేశ్వరరావు నల్లజాల శ్రీనివాసరావు, సీతారాం రెడ్డి అంబేద్కర్ మండల శేషు ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి సుభాష్ రెడ్డి గ్రామ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు