–కేంద్రాన్ని కోరిన ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా
Press Council of India: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: భారత దేశంలో జర్నలిస్టుల భద్రత రక్షణ (Protecting the safety of journalists)కోసం ఒక చట్టాన్ని తీసుకురావాల ని కేంద్రాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా (Press Council of India) (పీసీఐ) కోరింది. దేశంలో మీ డియా సిబ్బంది అరెస్టులు తప్పు డు నిర్బంధాలు బెదిరింపులపై ప్రెస్ కౌన్సిల్ సభ్యులు గుర్బీర్‌సింగ్ రూపొందించిన నివేదికను పీసీఐ ఆమోదించింది. అయితే కౌన్సిల్ చైర్‌పర్సన్, సుప్రీంకోర్టు (Chairperson of the Council, Supreme Court)మాజీ న్యాయమూర్తి రంజన్ ప్రకాశ్ దేశారు నుంచి ఈ విషయంలో భిన్నాభిప్రాయం వ్యక్తమైనప్పటికీ నివేదికకు సమర్ధన లభించటం గమనార్హం. ఈ నివేదిక కేంద్రానికి ప్రధానంగా మూడు ప్రతిపాదనల ను చేసింది.
అందులో మొదటిది దేశంలో జర్నలిస్టుల రక్షణ భద్రత కోసం జాతీయ చట్టాన్ని ప్రకటిం చటం. అలాగే, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Press Council of India) యాక్ట్‌కు మరిన్ని అధి కారాలు కలిగించాలనీ, ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే మీడియాతో వ్యవ హరించే విధానంపై పోలీసులకు అవగాహన కల్పించటం చట్టాన్ని అమలు పరిచే సంస్థల ప్రవర్తన నిబంధనలను క్రోడీకరించాలని నివేదిక పేర్కొన్నది.