–వరుసగా 11వ సారి ఎర్రకోట వేది కగా మాట్లాడిన ప్రధాని మోదీ రికా ర్డు
–98 నిమిషాల పాటు అత్యధిక సమయం మాట్లాడుస్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన ఘనత
Prime Minister Modi: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశవ్యా ప్తంగా ఘనంగా జెండా పండుగ (Flag Festival)జరి గింది. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఊరు-వాడా అన్ని చో ట్లా జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జెండా వందన కార్యక్రమం జరిగింది. జాతీ య పతావిష్కరణ అనంతరం వరు సగా 11వ సారి ఎర్రకోట వేదికగా మాట్లాడిన ప్రధాని మోదీ రికార్డు (Modi’s record)సృష్టించారు. ఏకంగా 98 నిమిషాల పాటు మాట్లాడి అత్యధిక సమ యం స్వాతంత్య్ర దినో త్సవ ప్రసంగం చేసిన ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. ఇవాళ సుధీర్ఘ ప్రసంగం చేయడంతో ఈ రికార్డు సొంతమైంది. దేశంలో నెల కొన్న అనేక సమస్యలను ప్రస్తా విస్తూ మోదీ (Modi) ప్రసంగించారు. దీంతో ఆయన పేరిటే ఉన్న మునుపటి 94 రికార్డును ఆయన బద్దలు కొట్టారు.
అయితే ఇక ఇతర ప్రధానమంత్రుల ప్రసంగాల విషయానికి వస్తే మోదీ కంటే ముందు 1947లో జవహర్ లాల్ నెహ్రూ (Jawahar Lal Nehru) 72 నిమిషాలు, 199 7లో ఐకే గుజ్రాల్ 71 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. ఇక తక్కువ సమయం ప్రసంగాల విషయానికి వస్తే జవహర్ లాల్ నెహ్రూ 1954, 1966లలో 14 నిమి షాలు మాత్రమే మాట్లాడారు. ఇక మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఎర్రకోట (Red Fort)నుంచి తక్కువ సమయం మాత్రమే ప్రసంగించారు. మన్‌మో హన్ సింగ్ 2012లో 32 నిమిషా లు, 2013లో 35 నిమిషాలు మాత్ర మే మాట్లాడారు. 2002, 2003లో నాటి ప్రధాని వాజ్‌పేయి 25 నిమి షాలు, 30 నిమిషాల కంటే తక్కువ సమయం స్వాతంత్ర్య దినోత్సవ (Independence Day)ప్రసంగాలు చేశారు.
11వ సారి జాతీయ పతా కావిష్కరణ
ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎర్రకోటపై ( Red Fort) వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 6,000 మంది ప్రత్యేక అతిథులు హాజర య్యారు. ఈ ఏడాది ఎర్రకోటలో జరిగే వేడుకలను చూసేందుకు యువకులు, గిరిజనులు, రైతులు, మహిళా వర్గాలతో (Youth, tribals, farmers, women communities) పాటు ఇతర ప్రత్యేక అతిథులను ఆహ్వానించా రు. అంతేకాదు వివిధ రంగాలకు చెందిన, వివిధ రంగాలలో రాణిం చిన వారిని వేడుకలకు ఆహ్వా నించారు.