— మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ
Prime Minister Narendra Modi : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఊబకాయం సమస్య నివారణకు ప్రధాని మోదీ ఓ చిట్కా చెప్పారు. ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణి లో ప్రసారమయ్యే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఈ ఆది వారం 119వ సంచికలో ఆయన ప్రసంగించారు. ఊబకాయంపై క్రీడాకారులు బాక్సర్ నిఖత్ జరీన్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పం పిన సందేశాలను వినిపించి వారిని అభినందించారు. అలాగే, గిరిజన భాష పరిరక్షణకు ఆదిలాబాద్‌కు చెందిన తొడసం కైలాశ్ అనే ఉపా ధ్యాయుడు చేస్తున్న కృషిని ప్రత్యే కంగా కొనియాడారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరిం చుకుని ఆ రోజు తన సోషల్ మీడి యా ఖాతాల బాధ్యతను దేశంలో ని స్ఫూర్తిదాయక మహిళలకు అ ప్పగిస్తానని ప్రకటించారు. ఊబకా యంపై ప్రధాని మోదీ మాట్లాడు తూ ‘‘పది శాతం నూనె వాడకం తగ్గించండి.
ఆ విషయం పది మందికి చెప్పండి. ఆ పది మంది ఇంకో పది మందికి సవాల్ విస రాలి. ఇలా నూనె వాడకాన్ని తగ్గిం చాలి. ఇందుకోసం ప్రతి నెలా వంట నూనె కొనుగోలు చేసేటప్పుడే ఎప్ప టికంటే పది శాతం తక్కువగా కొను గోలు చెయ్యాలి. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా మాది రిగా ఆరోగ్య సంరక్షణకు ఆహార నియమావళిని పాటించాలి. ఆరో గ్యవంతమైన దేశ నిర్మాణంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు. ఊబకాయం ఆందోళనక రమైన సమస్య అని, నూనె వాడ కాన్ని తగ్గించాలని నీరజ్ చోప్రా, నిఖత్ జరీన్ తమ సందేశాల్లో పిలు పునిచ్చారు. మరోవైపు, విద్యార్థుల కు ప్రధాని మోదీ సందేశం ఇస్తూ ‘‘జాతీయ సైన్స్ దినోత్సవం (28వ తేదీ) సందర్భంగా ప్రజలు ముఖ్యం గా విద్యార్థులు పరిశోధనా లేబొరే టరీలు, ప్లానిటోరియాలను, అంత రిక్ష కేంద్రాలను సందర్శించి ఒకరో జు శాస్త్రవేత్తగా గడపాలి. పుస్తక పరిజ్ఞానానికి అతీతంగా ప్రాక్టికల్ పరిజ్ఞానం పెంచుకోవాలని అన్నా రు.
అదిలాబాద్ వాసుకి అభినం దనలు ….ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు తొడసం కైలాశ్ గిరిజన భాష పరిరక్షణకు చేస్తున్న కృషిని ప్రధాని ఈ సంద ర్భంగా కొనియాడారు. గిరిజన మాండలికం పరిరక్షణకు, ‘కొలామి’ భాషలో గీతానికి స్వరరచన చేసేం దుకు కైలాశ్ ఏఐని వినియోగించా రని ప్రశంసించారు. ఏఐ వినియో గం భారత్ మరింత పురోగతి సా ధించాలని ఆకాంక్షించారు. తొడసం కైలాస్.. మహాభారత్ పుస్తకాన్ని కేవలం 3నెలల్లో గోండు భాషలోకి అనువదించారు. రామకృష్ణ మఠం వారు ఐదు సంపుటాల్లో వెలువరిం చిన బాలల మహా భారాతాన్ని కూడా గోండులోకి అనువదించారు. గోండు భాషలో ఒక యూట్యూబ్ చానెల్ కూడా నడుపుతున్నారు.