— సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
CPM Leader Mudireddy Sudhakar Reddy : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: స్వా తంత్ర దినోత్సవం ఆగస్టు 15 సం దర్భంగా నల్గొండ పట్టణంలో లాట రీ ద్వారా ఎంపికైన డబల్ బెడ్ రూ మ్ లబ్ధిదారులకు ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ స భ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డి మాండ్ చేశారు. మంగళవారం సిపి ఎం డబల్ బెడ్ రూమ్ సాధన పోరా ట కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరే ట్ ముందు ధర్నా నిర్వహించి ఏవో మోతిలాల్ కు వినతి పత్రం సమ ర్పించారు.
ఈ సందర్భంగా సుధాక ర్ రెడ్డి మా ట్లాడుతూ 2017 లో క లెక్టర్ ఆఫీస్ వెనుక భాగంలో 552 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభించా రని అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు వివిధ కార్యాల యాల ముందు అనేక ఆందోళనలు చేసిన తదుపరి 2023 మార్చిలో నల్గొండ పట్టణంలో దరఖాస్తులు స్వీకరించగా 10 వేల దరఖాస్తులు వచ్చాయని అందులో నుండి ప లు వురు అధికారులు పరిశీలించి మూ డు వేల మందిని అర్హులుగా గుర్తిం చారని గుర్తు చేశారు. పట్టణంలో పలు వార్డులలో ఫంక్షన్ హాల్లో సీసీ కెమెరాలు నిఘాలో లాటరీ ద్వారా 552 మంది లబ్ధిదారులను గుర్తిం చారన్నారు.
అర్హులను గుర్తించి రెండు సంవ త్స రాలు దాటిన గత టిఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి 20 నెల లు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇం డ్లు స్వాధీనపరచకుండా కాలయాప న చేస్తున్న ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం రిలే నిరాహార దీక్షలు, తహసిల్దార్ కలెక్టరేట్ కార్యా లయం ముందు ధర్నాలు నిర్వహిం చగా లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు స్వాధీనం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తామ ని పనులు ప్రారంభించి త్వరితగతి న పూర్తి చేయకుండా నత్తనడగా న డుస్తున్న విధానాన్ని ఖండిస్తున్నా మని అన్నారు. మంత్రి క్యాంపు కా ర్యాలయం కోట్లాది రూపాయలు పె ట్టి ఆరు నెలల్లో పూర్తిచేసిన చిత్తశు ద్ధి పేదల ఇండ్ల నిర్మాణం పై లేకపో వడం దురదృష్టకరమన్నారు.ఆగస్టు 15న లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధి దారులకు ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇచ్చి మిగిలిపోయిన మౌలిక సదుపా యాలను త్వరితగతిన పూర్తి చేసి వారికి స్వాధీనపరిచి పేదల పట్ల చి త్తశుద్ధిని చాటుకోవాలన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు లు సయ్యద్ హశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చి 20 నెలలు గడుస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దగ్గర మౌలిక సదు పాయాలు పూర్తి చేసి పేదలకు స్వా ధీనపరచకపోవడం విచారకరమని అన్నారు. ఆగస్టు 15 నాటికి ప్రొసీ డింగ్ ఆర్డర్స్ ఇవ్వని ఎడల ఆగస్టు 16 తర్వాత లాటరీ ద్వారా ఎంపికై న లబ్ధిదారులతో కలిసి ఆక్రమింప చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా క మిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్య దర్శి దండెంపల్లి సత్తయ్య, తి ప్పర్తి మండల కార్యదర్శి మన్నెం బి క్షం, పట్టణ కమిటీ సభ్యులు తు మ్మల పద్మ, కోట్ల అశోక్ రెడ్డి, దం డెంపల్లి సరోజ, గాదె నరసింహ, డ బల్ బెడ్ రూమ్ ఇండ్ల పోరాట సా ధనా కమిటీ కన్వీనర్ అవుట రవీం దర్, కమిటీ గంజి రాజేష్, కీసర ప్ర శాంతి, సిరాజుద్దీన్, పగిళ్ల జయ మ్మ, వెంకటమ్మ, గౌసియా, విజయ లక్ష్మి ,రజిని, ఝాన్సీ, యాదమ్మ, ర వి, చెన్నకేశవులు తదితరులు పా ల్గొన్నారు.