Professionalism in performance of duties: విధి నిర్వహణలో వృత్తిధర్మం
-- విద్యుత్ సరఫరా పునరుద్దరణలో సాహసం --చెరువు మధ్యలోని స్థంభానికి మరమత్తులు -- కరీంనగర్ జిల్లాలో లైన్ మెన్ కు ప్రశంసల జల్లులు
విధి నిర్వహణలో వృత్తిధర్మం
— విద్యుత్ సరఫరా పునరుద్దరణలో సాహసం
–చెరువు మధ్యలోని స్థంభానికి మరమత్తులు
— కరీంనగర్ జిల్లాలో లైన్ మెన్ కు
ప్రశంసల జల్లులు
ప్రజా దీవెన/కరీంనగర్: విధి నిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి వృత్తిధర్మాన్ని పాటించిన విద్యుత్ జూనియర్ విద్యుత్ లైన్‌మెన్‌కు ప్రశంసల వెల్లువ కొనసాగుతున్నాయి. ఓ జూనియర్ లైన్‌మెన్ తన ప్రాణాలను పణంగా పెట్టి గ్రామానికి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా ను పునరుద్ధరించాడు.
చెరువులో మధ్యలో ఉన్న విద్యుత్ స్థంభం వద్దకు నీళ్లల్లో ఈదుకుంటూ వెళ్లి డిస్క్ మార్చడం ద్వారా గ్రామానికి విద్యుత్ సరఫరాను అందించాడు. జూనియర్ లైన్‌మెన్‌పై విద్యుత్ అధికారులు, గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
హుజురాబాద్ డివిజన్‌లోని రాజపల్లి 33/11కేవీ సబ్ స్టేషన్ నుంచి చెల్పూరుకు 11 కేవీ ఎక్స్ ప్రెస్ ఫీడర్ లైన్ స్థానికంగా ఉన్న చెరువులో మధ్య నుంచి ఉంది. ఆదివారం ఉదయం చెరువులో ఉన్న ఒక స్తంభంపై 11కేవీ లైన్ బ్రేక్ డౌన్ కావడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
చెల్పూరు జేఎల్ఎం వెంకటేశ్వర్లు, ఏఎల్ఎం పరుశురాం, లైన్ ఇన్‌స్పెక్టర్ సమ్మయ్య చెరువులోకి ఈత కొట్టుకుంటూ వెళ్లి లైన్‌కు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరానుపునరుద్ధరించారు.చెరువులో ఉన్న విద్యుత్ స్తంభం వద్దకు ఈత కొడుతూ వెళ్లి సరఫరాను పునరుద్ధరించిన సిబ్బందిని ఎస్ఈ గంగాధర్, అధికారులు అభినందించారు.