Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Padmavathi Reddy : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం.

–కార్పొరేట్ కు దీటుగా కోదాడ ప్రభుత్వ వైద్యశాలను తీర్చిదిద్దుతాం: పద్మావతి రెడ్డి.

Padmavathi Reddy : ప్రజా దీవెన, కోదాడ: కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 10 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో 26 కోట్ల రూపాయలతో వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే 3కోట్ల 66 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రం అందుబాటులోకి వస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డాక్టర్ ముగ్గురు స్టాప్ నర్సులతో కలిపి జాతీయ రాబిస్ కంట్రోల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడంతో పాటు పుట్టుకతో బరువు తక్కువ ఉన్న పిల్లలందరికీ రిహాబిటేషన్ సెంటర్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని సిబ్బందికి సూచించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీవో సూర్యనారాయణ, డి సి హెచ్ ఎస్ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెడ్ డాక్టర్ దశరథ, కమిషనర్ రమాదేవి,వైద్యులు అభిరామ్, వైష్ణవి, నరసింహ, నాయకులు కేఎల్ఎన్ ప్రసాద్, కోదాడ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, కందుల కోటేశ్వరరావు, కమదన చందర్ రావు, మధు, ఈదుల కృష్ణయ్య, రామినేని శ్రీనివాసరావు, డాక్టర్ బ్రహ్మం, బాగ్దాద్, భాజాన్ ,ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.