— దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
Collector Ila Tripathi : ప్రజా దీవెన, చింతపల్లి: అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలునాయక్ తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా బుధవారం అయన దేవర కొండ నియోజకవర్గం పరిధిలోని చింతపల్లిలో నూతన రేషన్ కార్డు లను లబ్దిదారులకు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి న సమావేశంలో ఎమ్మెల్యే మాట్లా డుతూ ప్రజాపాలన ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలన్నింటిని నెరవేర్చడం జ రుగుతున్నదని, తక్కిన వాటిని కూ డా నెరవేరుస్తామని తెలిపారు.
గత ప్రభుత్వం 10 సంవత్స రాలలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, అలాగే ఇండ్లు కూడా ఇవ్వలేదని చెప్పారు. తాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు 6 గ్యారెంటీలను అమలు చేయడం జరుగుతున్నదని, అదేవి ధంగా 9 రోజుల్లోనే 9000 కోట్ల రూ పాయల రైతుల రుణమాఫీ చేయ డం జరిగిందని,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, సన్నబి య్యం పంపిణీ వంటివి తమ ప్రభు త్వం అమలు చేస్తున్నదన్నారు. ప్ర జలు వీటిని సద్వినియోగం చేసు కోవాలని ఆయన కోరారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లా డుతూ రేషన్ కార్డులు నిరంతర ప్ర క్రియ అని కార్డులు రానివారు కొ త్తగా దరఖాస్తు చేసుకుంటే విచా రించి రేషన్ కార్డు ఇవ్వడం జరుగు తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తు న్న సన్నబియ్యం పథకంలో భాగం గా అన్ని వసతి గృహాలు, అంగన్వా డి కేంద్రాలు, పాఠశాలలకు సన్న బి య్యం నిరంతరం ఇవ్వాల్సిన అవ సరం ఉందని, ఇందులో భాగంగా మండల స్థాయి స్టాక్ పాయింట్లు ఎప్పటికప్పుడు అధికారులు తనకి చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేకించి తహసిల్దార్ మొదలుకొని జిల్లా కలె క్టర్ వరకు ఎమ్ ఎల్ ఎస్ పాయిం ట్లు తనిఖీ చేస్తున్నామని తెలిపా రు.
దేవరకొండ నియోజకవర్గంలో ఇప్ప టివరకు 12008 కొత్త రేషన్ కార్డు లు ఇవ్వడం జరిగిందని, అం తేకా క 24554 మంది సభ్యులను రేషన్ కార్డులలో చేర్చడం జరిగిందని కలె క్టర్ తెలిపారు. చౌకధర దుకాణ డీ లర్ల సమస్యలను రాష్ట్ర పౌర సరఫ రాల శాఖ మంత్రి దృష్టికి తీసు కువె ళ్లడం జరిగిందని, త్వరలోనే వారి సమస్యలు పరిష్కారం అవు తా యని తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద సాగునీటిని విడుదల చేసినందున, అన్ని డిస్ట్రిబ్యూటరీ ల ద్వారా సక్రమంగా సాగునీరు అం దించేందుకు ఒక ఎకరా ఎండిపో కుండా సాగునీటిని అందుబాటు లో ఉంచుతామని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇంది రమ్మ ఇండ్లు, సీజనల్ వ్యాధులు, తదితర అంశాలపై మాట్లాడారు. ఆర్డిఓ రమణారెడ్డి, డీఎస్ఓ వెంక టేశ్వర్లు, పౌరసరఫరాల డిఎం హరీ ష్ ,తహసిల్దార్ రామకాంత్ శర్మ, తదితరులు హాజరయ్యారు.