Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Mandula Samel : ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం

–పేద ప్రజల సొంతింటి కల నెరవే ర్చే దిశగా ఇందిరమ్మ ఇండ్లు

–తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్

MLA Mandula Samel : ప్రజా దీవెన, తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయం కలను నెరవేర్చ డమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని వెలుగు పెళ్లి గ్రా మంలో 15వ ఆర్థిక సంఘం నుండి విడుదలైన రూ.20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న ఆరోగ్య ఉపకేంద్రంకు భూమి పూజచేశారు. అనంతరం తుంగతుర్తి మండల కేం ద్రంలో ప్రారంభించి నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభోత్సవం చేసి ఇందిర మ్మ ఇండ్లకు ముగ్గుల పోసే కార్యక్ర మంలో పాల్గొని మాట్లాడారు.

గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల ఆ రోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాము ఖ్యత ఇస్తుందన్నారు పేదల సొం తింటి కలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నా రు.గత 10 యేండ్ల బిఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క పేద కుటుంబా ని కి ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు ముఖ్య పాత్ర పోషించాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండే ళ్లలో విద్యా, వైద్య రంగాల బలోపే తం కోసం కృషి చేస్తుందన్నారు. చా లా గ్రామాల్లో అంతర్గత సిసి రోడ్ల ని ర్మాణం చేపట్టాల్సి ఉందని, త్వర లో పూర్తి చేయడానికి కృషి చేస్తా నని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దయానందం, ఎంపీ డీ వో శేష్ కుమార్, పంచాయతీరాజ్ డిఇ లింగా నాయక్, ఏఈ మహేష్, టిపిసిసి సభ్యులు గుడిపాటి నరస య్య,ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసి సిబి డైరెక్టర్ తుంగతుర్తి సింగిల్ విం డో చైర్మన్ గుడిపాటి సైదులు వ్యవ సాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, సంవిధాన్ మండల కో ఆర్డినేటర్ మాచర్ల అనిల్, పట్టణ అధ్యక్షుడు, తుంగతుర్తి ఉప్పుల రాంబాబు యాదవ్, పెద్ద బోయిన అజయ్, కొండ రాజు,గంగరాజు, వెలుగుపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు వాసం వెంకన్న, మాజీ ఎంపిటిసి ఆంగోతు సోమ్ల నాయక్, గ్రామ కార్యదర్శి దుబ్బాక రఘు,దాసరి శ్రీను, కలకోట్ల మల్లేష్, ముత్యాల వెంకటేశ్వర్లు, వీరబోయిన రాము లు, సుమన్, రమేష్, జలంధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త లు తదితరులు పాల్గొన్నారు.