Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 12:43 pm Posted by : praja deveena

District Collector Badugu Chandrashekhar : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విధిగా గుణాత్మక విద్య 

— నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్

District Collector Badugu Chandrashekhar : ప్రజా దీవెన, అడవిదేవులపల్లి: ప్ర భుత్వ పాఠశాలల ద్వారా విద్యా ర్థులకు గుణాత్మక విద్యను అందిం చాలని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ అన్నారు. గురువారం అయన న ల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మం డల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాలను ఆకస్మికంగా తని ఖీ చేశారు. పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథ కాన్ని పరిశీలించారు. మెనూ ప్రకా రం భోజనం పెడుతున్నది, లేనిది పాఠశాల హెడ్మాస్టర్, అలాగే విద్యా ర్థులను అడిగి తెలుసుకున్నారు.

కిచెన్ షెడ్ కు రేకులు కావాలని వంట సిబ్బంది హెడ్మాస్టర్ కోరిన కోరిక మేరకు అమ్మ ఆదర్శ పాఠశా ల కమిటీ ద్వారా తీర్మానం చేయిం చి అంచనాలు పంపించాలని చె ప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ ని ర్మాణంలో ఉన్న బాలికల టాయి లెట్స్ ను పరిశీలించారు. అనంత రం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు.

విద్యార్థులు బాగా చదవాలని, ల క్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని సాధ న కు కృషి చేయాలని చెప్పారు. కొం దరు విద్యార్థులు యూనిఫార్మ్స్ ధ రించకపోవడంపై కారణాలను అడి గి తెలుసుకున్న కలెక్టర్ ప్రతి వి ద్యార్థి పాఠశాలకు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి రావాలని చెప్పారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ భూ భారపై వచ్చిన దరఖాస్తుల పరి ష్కారంలో భాగంగా 130 వ సర్వే నంబర్ లో దరఖాస్తుదారు వతు లోతు భాష పొలాన్ని తనిఖీ చేశా రు. నిబంధనల ప్రకారం సర్వే నిర్వ హించి వివరాలు పంపాలని తహ సీల్దార్ ను ఆదేశించారు. పాత ప ట్టాదారు పాసుపుస్తకంలో పేరు ఉం డి ఆన్లైన్లో కొత్త పాస్ పుస్తకంలోకి ఎక్కించేందుకు గాను జిల్లా కలెక్టర్ అక్కడికక్కడే అనుమతించారు. జిల్లా కలెక్టర్ వెంట తహసిల్దార్ వి. రాగ్యనాయక్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ తదితరులు ఉన్నారు.