Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chief Minister A. Revanth Reddy : విద్యా బోధ‌న‌లో నాణ్య‌త ప్ర‌మా ణాలు మరింతగా పెంచాలి

–విద్యార్థులు, బోధ‌న సిబ్బందికి ఫే షియ‌ల్ రిక‌గ్నేష‌న్ త‌ప్ప‌నిస‌రి

–ఒకే విభాగం ప‌రిధిలోకి విద్యా శా ఖ ప‌రిధిలోని నిర్మాణాలు

–గ్రీన్ ఛాన‌ల్‌లో మ‌ధ్యాహ్న భోజ‌న బిల్లుల చెల్లింపు

–ప్ర‌తి విద్యా సంస్థ‌లో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం

–విద్యా శాఖ స‌మీక్ష‌లో ము ఖ్య‌ మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

Chief Minister A. Revanth Reddy : ప్రజా దీవెన, హైద‌రాబాద్: ప్రభుత్వ పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వ విద్యాల‌ యాల వ‌ర‌కు ప్ర‌తి విద్యాసంస్థ‌లో నూ మెరుగైన బోధ‌న సాగాల‌ని వి ద్యా బోధ‌న‌లో నాణ్య‌త ప్ర‌మాణా లు మ‌రింత‌గా పెంచాల‌ని ముఖ్య‌ మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, ప్రొఫెషిన‌ ల్ కోర్సులు బోధించే క‌ళాశాల‌ల్లో వి ద్యార్థులు, బోధ‌న సిబ్బందికి ఫేషి య‌ల్ రిక‌గ్నేష‌న్ త‌ప్ప‌నిస‌రి చేయా ల‌ని సీఎం ఆదేశించారు. ముఖ గు ర్తింపుతో హాజరుశాతం మెరుగ‌వ‌ డంతో పాటు ప్రొఫెష‌న‌ల్ విద్యా సం స్థ‌ల్లో లోటుపాట్ల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ న్నారు. విద్యా శాఖ‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి శు క్ర‌ వారం స‌మీక్ష నిర్వ‌హించారు.

విద్యా శాఖ ప‌రిధిలో అద‌న‌పు గ‌దు లు, వంట గ‌దులు, మూత్ర‌శాల‌లు, మ‌రుగుదొడ్లు, ప్ర‌హారీల నిర్మాణం వివిధ విభాగాలు చేప‌ట్ట‌డం స‌రికా ద‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ నిర్మాణాల‌ నాణ్య‌త‌ప్ర‌మాణాలు, ని ర్మాణ ప‌ర్య‌వేక్ష‌ణ‌, నిధుల మంజూ రు జ‌వాబుదారీత‌నానికి గానూ ఒకే విభాగం కింద ఉండాల‌న్నారు. యం గ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షి య‌ల్ స్కూళ్ల నిర్మాణాన్ని ప‌ర్య‌వేక్షి స్తున్న విద్యా, సంక్షేమ వ‌స‌తుల అ భివృద్ధి సంస్థ (EWIDC) కింద‌నే రా ష్ట్రంలోని అన్ని విద్యా సంస్థ‌ల ని ర్మాణాలు కొన‌సాగాల‌ని సీఎం ఆదే శించారు. ఈ సంస్థ‌కు అవ‌స‌ర‌మైన ఇంజినీరింగ్‌, ఇత‌ర సిబ్బందిని ఇత‌ ర విభాగాల నుంచి వెంట‌నే డిప్యూ టేష‌న్‌పై తీసుకోవాల‌ని సూచించా రు.

మ‌ధ్యాహ్న భోజ‌న బిల్లుల చెల్లింపు ను గ్రీన్ ఛాన‌ల్‌లో చేప‌ట్టాల‌ని ఈ వి ష‌యంలో ఎటువంటి అల‌స‌త్వం చూపొద్ద‌ని సీఎం అన్నారు. తెలం గాణ‌లోని మ‌హిళా కళాశాల‌లు, బాలికల పాఠ‌శాల‌ల్లో మూత్ర‌శాల‌ లు, మ‌రుగుదొడ్లు, ప్ర‌హ‌రీల నిర్మా ణాన్ని వేగ‌వంతం చేయాల‌ని సీఎం ఆదేశించారు. కంటైన‌ర్ కిచెన్ల‌కు ప్రా ధాన్య‌మివ్వాల‌ని, కంటైన‌ర్ల‌పైన సో లార్ ప్యానెళ్ల‌తో అవ‌స‌ర‌మైన వి ద్యుత్ వినియోగించుకోవ‌చ్చ‌ని సీ ఎం తెలిపారు. ప్ర‌తి పాఠ‌శాల‌లో క్రీ డ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అవ‌ స‌ ర‌మైతే కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిన వ్యాయా మ ఉపాధ్యాయుల‌ను నియ‌మించే అంశాన్ని ప‌రిశీలించాల‌ని అధికారు ల‌ను సీఎం ఆదేశించారు.

అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల‌ల కింద పాఠ‌ శాల‌ల్లో పారిశుద్ధ్య ప‌నులకు సం బంధించిన బిల్లులు త‌క్ష‌ణ‌మే విడు ద‌ల చేయాల‌ని సీఎం ఆదేశించారు. సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల్లోని బాలిక‌ల‌కు వివిధ అంశాల‌పై కౌన్సె లింగ్ ఇచ్చేందుకు మ‌హిళా కౌన్సెల‌ ర్ల‌ను నియ‌మించాల‌ని సీఎం సూ చించారు. విద్యా రంగంపై పెడుతు న్న ఖ‌ర్చును తాము ఖ‌ర్చుగా కాక పెట్టుబ‌డిగా చూస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యంగ్ ఇం డియా ఇంటెగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల‌తో పాటు విద్యా రంగం అ భి వృద్ధికి తీసుకునే రుణాల‌ను ఎఫ్ ఆర్‌బీఎం ప‌రిమితిలో లేకుండా చూ డాల‌ని ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ ట్టి విక్ర‌మార్క కేంద్ర ఆర్థిక శాఖ మం త్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు విజ్ఞ‌ప్తి చే శార‌ని సీఎం తెలిపారు.

ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో చదువు తున్న వారిలో 90 శాతానికి పైగా బీ సీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నార‌ ని, ఈ విష‌యాన్ని నిర్ధారించేందుకు గ‌త ప‌దేళ్ల‌లో ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ ల్లో చ‌దివిన వారి వివ‌రాల‌పై నివే దిక రూపొందించాల‌ని సీఎం ఆదే శించారు. ఈ స‌మీక్ష‌లో ముఖ్య‌మం త్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి బి. అజిత్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ఓఎస్డీ వే ములు శ్రీ‌నివాసులు, విద్యా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి యోగితా రాణా, ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ ప్రొ ఫెస‌ర్ బాల‌కిష్టారెడ్డి, సాంకేతిక వి ద్యా శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ‌దేవ‌సేన‌, పా ఠ‌శాల విద్యాశాఖ సంచాల‌కుడు న‌ వీన్ నికోల‌స్ త‌దిత‌రులు పాల్గొ న్నారు.